జనసైనికులని చూస్తుంటే జనసేన ఇప్పుడే తన అసలు రాజకీయం మొదలుపెట్టినట్లు ఉంది.. !

జనసైనికులంటే గెలిస్తే సంబరాలు చేసుకుని ఓడిపోతే నిరుత్సాహపడే వాళ్ళు కాదని గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని ప్రజలకు తెలియచేస్తూ “మార్పు కోసం జనసేన” కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం గ్రామంలో జనసైనికులతో కలిసి గ్రామంలో అన్ని వీధులు చెత్త లేకుండా శుభ్రం చేసి మరియు చెత్తతో పూడుకుపోయిన మురికి కాలువలు పూడిక తీసి మురికినీరు నిల్వలేకుండా చేసాము పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, బహిరంగమలవిసర్జన చెయ్యరాదని, దురలవాట్ల నుంచి బయటపడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించాము.

ఈ విధంగా చేయటంవల్ల సమస్యవస్తే గెలిచిన వారి ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలని, ఓడిన వారైతే మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ కనిపించరని కానీ జనసైనికులు గెలుపోటములు పట్టించుకోకుండా ప్రజలలోకి వచ్చి ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్థులు అభినందించారు మార్పుకు సమయం పట్టవచ్చేమో కానీ అసాధ్యం కాదు మనం పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది… అని జన సైనికులు బలంగా నమ్ముతున్నారు..

దీన్ని బట్టి చుస్తే జనసేన అధినేత ఓట్ల రాజకీయంలో ఓడిపోయి ఉండవచ్చు కానీ ప్రజల మదిలో తన మార్క్ ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో జరిగే తప్పులని నిలదీస్తూ ఇంకా ప్రజలలోకి వెళ్లాలని జనసైనికుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *