జనసేన పార్టీ ఆఫీస్ మూసివేయాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్?

ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందే, జనసేన పార్టీ కార్యకలాపాలను మూసివేస్తోంది. పవన్ కళ్యాణ్ యొక్క జన సెన పార్టీ హైదారబాదు మరియు విజయవాడలలో రెండు సంవత్సరాల క్రితం తన పార్టీ కార్యకలాపాలకు ఆఫీసులని అద్దెకు తీసుకుంది.

హైదరాబాద్లోని మాదాపూర్ లో ఉన్న కేంద్ర కార్యాలయం ఇప్పటికీ పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ, ఇతర ప్రదేశాలలో భవనాలను మూసివేయాలని పార్టీ నిర్ణయించింది.

జనసేన యొక్క ఐటీ సెంటర్కు ముందు టు-లెట్ బోర్డ్ను ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ యొక్క ఐటి ప్రాంతంలోని కార్యాలయం మూసివేయబడుతోంది. అన్ని ఉద్యోగులకి పింక్ స్లిప్స్ కూడా ఇచ్చేసారు అని సమాచారం.

దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ తన పార్టీ ఈ ఎన్నికలలో అంత ప్రభావం చూపదని బావించినట్లు తెలుస్తోంది. అయితే మే 23 ఎన్నికల ఫలితాలలో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి.

  • 54
    Shares