జగన్ దీపాన్ని వెలిగించేందుకు నిరాకరించారట

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమనికి హాజరు అవడంతో, జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించాలని నిర్వాహకులు కోరడంతో అందుకు జగన్ నిరాకరించారట. జ్యోతిని వెలిగించేందుకు జగన్ నిరాసక్తతను చూపారట.

ఈ విషయాన్ని టిడిపి పార్టీ నుండి బిజెపికిలోకి ఫిరాయించిన సీఎం రమేశ్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే అని నెటిజన్లు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది అని విమర్శలు వినిపిస్తున్నాయి.