బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ కమెడియన్.?

హైపర్ ఆది జబర్దస్త్ షో కామెడీ షో ద్వారా తెగ ఫేమస్ అయ్యాడు అని మన అందరికి తెలిసిందే. ఆ షోలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ కమెడియన్ ఎవరంటే మొదట వినిపించే పేరు ఆది పేరే అని చెప్తారు. అయితే ఈ వారం ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు అంతా కాస్త డల్ అయ్యారు అని తెలుస్తోంది. అయితే ఎపిసోడ్ చెయ్యకపోవడానికి రీజన్స్ వేరేవి చెప్తున్నా అసలు కారణం మాత్రం బిగ్‌బాస్-3 హౌస్‌లోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశం ఇవ్వడమే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేషన్ అయ్యింది.

ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషా రెబ్బా హౌజ్‌లోకి రాబోతున్నట్టు బలంగా వార్తలు వచ్చాయి. విలిద్దరిలో ఈషా లేదా ఆది ఎవరో ఒకరు మాత్రమే ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ట్రాన్స్ జండర్ ఐన తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బొస్స్ హౌజ్‌లోకి ఎంటర్ చేసి ఊహించని సేన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ ఈ సారి మాత్రం ఎలా సర్ఫ్రైజ్ చేస్తాడో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *