ఫస్ట్ టాక్ : ‘ఇస్మార్ట్ శంకర్’… ఎలా ఉందో తెలుసా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్ ‘ మూవీ జులై 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్స్  ప్రేక్షకులను సినిమా పైన ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని అంటున్నారు. అలాగే రామ్ చిత్ర యూనిట్ సభ్యులతో  ‘ఇస్మార్ట్ శంకర్ ‘ చూసిన తర్వాత ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే.

ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూశా.. దీనమ్మా కిక్కూ!!
స్క్రీన్‌పై చూసుకున్నప్పడు వచ్చిన కిక్కే వేరప్పా.. ఇలాంటి కిక్ ఇచ్చిన సినిమా చేసి చాలా రోజులైంది. థాంక్స్ పూరీ జగన్నాథ్ గారూ అనిట్వీట్ చేశాడు.

సరైన సక్సెస్ లేని పూరి, రామ్ లకు ఈ చిత్రం చాలా కీలకమైనది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.