మదర్ థెరిసా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు – Interesting Facts About Mother Teresa – Mana Telugu Nela

మదర్ థెరిసా గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు

Mother teresa Biograpgy
Mother Teresa
 • మదర్ తెలిస్సా ( Mother teresa) అసలు పేరు ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (గొంక్శే అనే పదానికి ” అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్ధం
 • జననం : 1910 ఆగష్టు 26, ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం(ఇప్పుడు స్కోప్జే, మాసిడోనియా)యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27,ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు.
 • తల్లి తండ్రులు : ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లే మరియు డ్రాన బొజాక్షిహ్యు దంపతుల ఆఖరి సంతానం.
 • భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
 • జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ చే రచింపబడిన జీవితచరిత్ర ప్రకారం ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథలపట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు.
 • 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ కలవలేదు.
 • 1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు.మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు.
 • 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు.
 • ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు; అటు వెంటనే అనాథల మరియు అన్నార్తుల అవసరాలను తీర్చ సాగేరు. ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేసాయి.
 • తెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు.ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం మరియు ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది
 • 1950 అక్టోబరు 7 ఆమె వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు అదే తరువాత మిషనరీస్ అఫ్ ఛారిటీగా రూపొందింది.
 • ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం,
 • గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు
 • మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.
 • అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
 • 1962 లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా శతాబ్ద మూడో భాగంలో అందరికంటే ముందుగా భారతప్రభుత్వం ఆమెను గుర్తించింది.తరువాతి దశాబ్దాలలో
 • భారత దేశ అత్యున్నత పురస్కారాలైన అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూఅవార్డును 1972 లోను,
 • భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980 లోను అందుకున్నారు.
 • దక్షిణ లేదా తూర్పు ఆసియా దేశాల వారికి ఇచ్చే ఫిలిప్పీన్స్ కు చెందిన రామన్ మాగ్సేసే అవార్డును 1962 లో మదర్ థెరీసా అంతర్జాతీయ అవగాహనకు గాను అందుకున్నారు.
 • 1983 లో పోప్ జాన్ పాల్ II సందర్శనార్ధం మదర్ థెరీసా, రోమ్ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ను అమర్చారు. 1991 లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కున్నారు.
 • 1997 సెప్టెంబర్ 5 న మరణించారు.

 

Pic Credit and Reference  : Wikipedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *