కొండారెడ్డి బురుజు చరిత్ర – Interesting Facts About Kondareddy Fort

కొండారెడ్డి బురుజు యొక్క ప్రాముఖ్యత

 

Kondareddy fort

 

రాయలసీమ అంటే కేవలం రక్తపాతం ఫ్యాక్షనిజం మే కాదు..” రాయలసీమ అంటే రాళ్లసీమ కాదు రతనాల సీమ “ఎవరు రాయని చరిత్ర ఎన్నో సుందరమైన దృశ్యాలు కొలువు తీరిన నెల ఈ రాయలసీమ అందులో ముఖ్యమైనది కొండారెడ్డి బురుజు. ఇది పౌరుషానికి పెట్టింది పేరు కొండారెడ్డి బురుజు..

కర్నూలు గురించి మాట్లాడిన అంధ్రుల తొలి రాజధాని గురించి మాట్లాడిన మొదట గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు .విదేశీయుల ఆధిపత్యాన్నిఅడ్డుకున్న సామ్రాజ్యతో పాటు ఒక సాహస వీరుడి జ్ఞాపకాలను కూడా తనలో దాచుకుంది.. ఇంతకాలం ఇది నిర్లక్షనికి గురైంది.. ఇది కేవలం ఒక కట్టడం గానే చూసారు కానీ ఎన్నో చరిత్ర పుటల్ని తనలో దాచుకుంది అని ఏ మధ్య నే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చే ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది

నిజానికి ఇది క‌ర్నూలు కోట‌లో భాగం. శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌న త‌ర్వాత విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాధీశుడైన ఆతని స‌వ‌తి త‌మ్ముడు అచ్యుత దేవ‌రాయ‌లు నిర్మించారు అని అందుకే దీని అసలు పేరు అత్యుత దేవరాయ బురుజు అని తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ కొండారెడ్ది బురుజు విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మిచబడినదనడంలొ సందేహం లేదు.

క్రీ. శ 1602-1618 మధ్య కాలంలో అబ్దుల్ వహబ్ కందన ఓలు ని పరిపాలిస్తూవుండేవాడు. ఇతని పాలన సమయం లో నంది కొట్కూరు పాతకోట పాలగడు అయిన కొండారెడ్డి ఇతని పాలనని ఎదురించాడు అని అందుకే ఇతనిని ఓడించి ఈ బురుజులో బందిచారు అని ఆ తరువాత కొండారెడ్డి కారాగారం లో మరణించడం తో దానికి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చింది అని కొందరి అభిప్రాయం, ‘ఇంకొందరి వాదన ప్రకారం విదేశీయుల పఈపాలన కాలం లో అలంపూర్ లో నివసించే కొండారెడ్డి అనే దేశభక్తుడు వీళ్ళ పఈపాలనను ఎదురించటం తో కొండారెడ్డి ని ఈ కోటలో బంధించినందుకు ఇతని పేరు మీది కొండారెడ్డి బురుజు అని పిలిచే వారు అని కొందరి వాదన’… అయితే అత్యధికుల వాదన ప్రకారం నంది కొట్కూరు పాలగని వల్లే ఈ కోటకి కొండారెడ్డి బురుజు అని అభిప్రాయం…
కానీ 1950 కి ఆసలు ఏ కోట కి పెరు ఉందా లేదా అనేది ప్రశ్నార్ధకం. ఎందుకు అంటే 1930 లో గన్నావరపు సుబ్బరామయ్య ప్రచురించిన వ్యాసం లో కొండారెడ్డి కోట గురించి విశ్లేషణ గా రాసారు కానీ అందులో కొండారెడ్డి కోట ఫోటో కింద ఒక పాడుబడిన కోట అని మాత్రమే రాసారు , కర్నూలు ప్రాంతంలో నివసించిన విలియం ఆర్థర్ స్టాంటన్ 1950లో అమెరికాలొ ప్రచురించిన ” ది అవేకనింగ్ ఆఫ్ ఇండియా” అనే పుస్తకంలో కూడా కొండారెడ్డి బురుజు చిత్రం క్రింద “బాస్టియన్ టు ద ఓల్డ్ ఫోర్ట్” అని రాసారే గానీ కొండారెడ్డి బురుజు అని రాయలేదు. అంటే 1950 కి ముందు ఈ బురుజుకి పెరు లేదా ?  ఉంటే మరి ఎందుకు ప్రస్తావించలేదు ?

కర్నూలు కోట‌లో ప్ర‌స్తుతం మిగిలి ఉన్న భాగం నుంచి కృష్ణాన‌ది దిగువ‌గా మ‌హ‌బూబ్న‌గ‌ర్ జిల్లా అలంపూర్ కోటికి ఓ సొరంగ‌మార్గం ఉండేద‌ని చెబుతారు. కాని ఏ మధ్యనే ఏ ద్వారం ను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఈ కోట నిర్మాణం అంత ఎర్రటి మట్టి ని రాళ్ళ మధ్యలో వేసి కట్టారు.

ఏది ఏమైనా కొండారెడ్డి బురుజు పర్యటకులకి ఒక కొత్త అనుభూతి ని ఇస్తుంది. ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్ జరిగాయి. చివరికి ఒక షార్ట్ లో అయిన ఈ బురుజు ని చూపిస్తే సినిమా హిట్ అవటం పక్క అనే నమ్మకానికి వచ్చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *