హైదరాబాదీ వాసి తెలివికి తెలుగు రాష్ట్రంలో జనం ఫిదా..!
ప్రస్తుత పరుగులు పెడుతున్న ఆధునిక ప్రపంచంలో నేడు ఆకలి వేస్తే ఏదైనా హోటల్‌కు వెళ్లి తినేవారి సంఖ్య చాలావరకు తగ్గింది. దీనికి ఒక్కటే కారణం ఆన్లైన్లో ఇంటితలుపులువద్దకే ఆహారాన్ని తీసుకొచ్చే డెలివరీ చేసే యాప్‌లు కుప్పలుతెప్పలుగా ఉండటం. దీనిలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందిన ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, స్విగ్గి వంటివి. ఇక ఇటీవల జొమాటో యాప్ ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో నిలిచింది మనం చూస్తూనేవునం. కాగా తాజాగా మన హైదరాబాదీ వాసి దెబ్బకు జొమాటో మరోసారి వార్తల్లోకి నిలిచింది.
ఇటీవల హైదారాబాద్‌కు చెందిన ఒబేష్ కొమిరిశెట్టి అనే వెక్తి ఇనార్బిట్ మాల్లో షాపింగ్ చేసి ఇంటికి తిరుగుప్రయాణం అయ్యాడు. అప్పటికే రాత్రి సమయం 11.50 కావడంతో బయటకొచ్చి ఇంటికి వెళ్లేందుకు “ఓల క్యాబ్” బుక్ చేద్దాం అని చూడగా క్యాబ్ రేటు ఏకంగా రూ.300కు పైగా ఉండటంతో అతడికి ఎం చేయాలో ఐయోమయం పరిస్థితిలో ఓ అదిరిపోయే ఐడియా తట్టింది.
అతడు ఉన్న చోటే ఓ హోటల్ ఉండటం చూసాడు. వెంటనే మనోడు జొమాటో యాప్ ఓపెన్ చేసి సదరు హోటల్ నుండి ఓ దోసను ఆర్డర్ చేశాడు. వెంటనే ఓ జొమాటో డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి దోస తీసుకుంటుడటం గమనించి వెంటనే ఒబేష్ అతడి వద్దకు వెళ్లి తానే ఈ దోస ఆర్డర్ చేశానని వివరించి అది తనకు ఇచ్చి అతడిని ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా కోరాడు.
ఆ డెలివరీ బాయ్ కూడా అందుకు ఒప్పుకుని ఒబేష్ను ఇంటి వద్ద దింపేందుకు వెళ్లాడు. డెలివరీ బాయ్ ప్రతిఫలంగా తనకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందిగా మాత్రమే కోరినట్లు ఒబేష్ వెల్లడించాడు. ఇదే విషయాన్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. తనను అటువంటి పరిస్థితుల్లో ఇంటి వద్ద ఫ్రీగా దింపినందుకు జొమాటోకు కృతజ్ఞత తెలిపాడు. ఇది చూసిన నెటిజన్లు అతని తెలివిరా మంత్రముగ్దులు అయ్యారు..! తెలుగోడి తెలివితేటలు ఇలా ఉంటాయి అని అంతర్జాలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.