హైదరాబాదీ బిరియాని చేయడం – Hyderabad Chicken biriyani | Manatelugunela

హైద్రాబాద్ అనగానే అందరికి గుర్తు వచ్చేది బిరియాని. హైద్రాబాద్ చికెన్ డమ్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హైద్రాబాద్ బిరియాని ఎంతలా ఫేమస్ అంటే నార్త్ ఇండియన్ మన హైద్రాబాద్ బిరియాని తినడానికే వచ్చి వెళుతుంటారు.  భారతదేశంలో అనేక రకాల బిర్యన్లు ఉన్నాయి. ఇపుడు మనం హైదరాబాదీ బిర్యానీ చేయడం ఎలానో తెలుసుకుందాం….
హైదరాబాదీ బియానీని కావలసిన పదార్థలు : 
 • 1 కిలో మాంసం
 • 1 టేబుల్ స్పూన్ ఉప్పు
 • 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి
 • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
 • 1 టేబుల్ స్పూన్ పచ్చి మిర్చి పేస్ట్ (రుచి కోసం ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేస్కోవచ్చు)
 • 1 టేబుల్ స్పూన్ జీలకర్ర విత్తనాలు
 • 3-4 చెక్కలు దాల్చిన చెక్క
 • 4 లవంగాలు
 • 2 జాపత్రి ఆకులూ
 • 3 బిరియాని ఆకులూ
 • 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం
 • 250 గ్రామ్లు  పెరుగు
 • 4 టేబుల్ స్పూన్లు వెన్న
 • 750 గ్రాము సగం ఉడికించిన అన్నం
 • 1 tsp కుంకుమ పువ్వు
 • 1/2 కప్ నీరు
 • 1/2 కప్ ఆయిల్
 • గార్నిష్ పదార్థాలు:
 • ఉడకబెట్టిన గుడ్లు,
 • క్యారట్లు ముక్కలు
 • దోసకాయ ముక్కలు
హైదరాబాదీ బిర్యానీని ఎలా తయారు చేయాలి?
1. మొదటగా మాంసాన్ని శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు పాన్ లో మాంసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పచ్చి మిరపకాయ, ఉల్లిపాయలు,  ఏలకులు పొడి,  లవంగాలు, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, లవంగాలు, జీలకర్ర,  జాపత్రి ఆకులూ, పుదీనా ఆకులు మరియు నిమ్మరసం. అన్నింటిని ఒక్కొక్కటిగా పాన్ లో వేసుకోవాలి.
2.చిన్న మంట పైన పూర్తిగా ఈ పదార్థాలు అన్ని  కలిసిపోయేలాగా కలపాలి.
3. తర్వాత పెరుగు, వెన్న, సగం ఉడికిన అన్నం, కుంకుమ, నీరు మరియు నూనె జోడించండి, బాగా కలపాలి.
4. ఇప్పుడు పాన్లో మసాలాలు, అన్నిటిని వేసి మాంసపు ముక్కలు విరగగా కుండా బాగా కలుపుకోవాలి.
5. మూత మూసివేసి, 25 నిమిషాలు బాగా ఉడికించాలి .
6. హైదరాబాదీ   బిర్యాని తినడానికి సిద్ధంగా ఉంది. ఉడికించిన గుడ్లు, ముక్కలుగా చేసుకున్న క్యారట్లు, దోసకాయలు బిరియాని పైన కలర్ ఫుల్ ఉండేదుకు వేసుకోండి.
బియానీకి కావాల్సిన పదార్థలు :
మాంసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లి పేస్ట్, పచ్చి మిరప పేస్ట్ (రుచికోసం ఉల్లిపాయలు), ఏలకులు పొడి, దాల్చినచెక్క, జీలకర్ర విత్తనాలు, లవంగాలు,బిరియాని ఆకులు, నిమ్మ రసం, నీరు, పెరుగు, సగం ఉడికించిన అన్నం, కుంకుమ పువ్వు పొడి, ఆయిల్, గుడ్లు, క్యారట్లు, దోసకాయలు ముక్కలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *