చిల్డ్ సమ్మర్ ఫ్రూట్ సలాడ్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్

How To Make Fruit Salad In Telugu
Fruit Salad

కావల్సిన పదార్థాలు:

పుచ్చకాయ: 1

దోసకాయ: 1/2

మామిడిపండ్లు: 2

బొప్పాయి: 1/2

అరటి పండ్లు: 2

బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా

షుగర్ 1tsp

రుచికరమైన అఛారీ గోబి రిసిపి తయారి చేసే విదానం

తయారుచేయు విధానం:

1. ముందుగా పుచ్చకాయను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఈ పుచ్చకాయను రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టాలి.

3. అలాగే బొప్పాయకాను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3. అలాగే మస్క్ మెలోన్(దోసకాయను)కూడా కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా రిఫ్రిజరేటర్ లో పెట్టుకోవాలి. వాటిని ఓపెన్ గా పెట్టకూడదు. అలా పెడితే, రుచి, పోషకాలు కోల్పియి, డ్రైగా ఉంటాయి.

4. అలాగే మామిడిపండ్లను కూడా చేత్తో సాఫ్ట్ గా తీసుకోవాలి. మూత ఉన్న ఒక బాటిల్ లేదా బాక్స్ లో వేసి వీటిని కూడా ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. 

5. తర్వాత వాటర్ మెలో తీసుకొని అందులోనే గింజలను సాధ్యమైతే తొలగించి ఒక పెద్ద బౌల్లో వేయాలి. 

6. వీటితో పాటు, దోసకాయ, బొప్పాయ కాయ ముక్కలు, అలాగే అరటి పండ్ల ముక్కలు కూడా వేయాలి.

7. వీటితో పాటు లిచి పండ్లను కూడా సర్ధాలి. ఈ కట్ చేసి పండ్ల ముక్కలమీద అన్నింటి మీద పడేలా మామిడికాయ గుజ్జును కూడా వేయాలి. 

8. చివరగా కొద్దిగా బ్లాక్ సాల్ట్ బేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. అంతే సమ్మర్ చిల్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *