రుచికరమైన అఛారీ గోబి రిసిపి తయారి చేసే విదానం

Achari Gobhi Recipe
How to make achari gobhi Recipe in Telugu

➡ కావల్సిన పదార్థాలు:

ఆలివ్ ఆయిల్: 4tbsp

కాలీఫ్లవర్: 3cups (చిన్న పువ్వులుగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ: 1 కప్

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp

టమోటో గుజ్జు: 2tbsp

పెరుగు: 2tbsp

ఆచారి మసాలా: 1tbsp

కారం: ½ tsp

ఉప్పు: రుచికి సరిపడ

నిమ్మరసం: 1tsp

ఆమ్చూర్ పొడి: ½tsp

తాజా కొత్తిమీర: 2tbsp (తరిగిన)

➡ అఛారీ మసాలా పౌడర్ కోసం:

ఎండు మిర్చి: 16-18

ధనియాలు: 1tbsp

ఉల్లిపాయ విత్తనాలు: 3tsp

సోంపు: 6tbsp

ఆవాలు: 6tbsp

మెంతులు / మెంతుల్లో: 2tsp

జీలకర్ర: 6tsp

ఉప్పు: 6tbsp

పసుపు: 3tbsp

ఇంగువ: ½tsp

డ్రై మామిడి పొడి: 3tsp

➡ తయారుచేయు విధానం: 

డ్రై మామిడి పొడి తయారుచేయు విధానం: 

1. ఎండుమిర్చి, ధనియాలు, ఉల్లిపాయ విత్తనాలు, సోంపు, ఆవాలు, మరియు జీలకర్ర లైట్ గా రోస్ట్ చేయాలి.

2. తర్వాత వీటిని పక్కకు తీసుకొని 5నిముషాలు వేయించుకోవర్ాలి.

3. తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.

4. ఈ పొడిని మూత గట్టిగా ఉన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది. 

➡ అచారి గోబి తయారుచేయు విధానం: 

1. పాన్ లో రెండు చెంచాలా నూనె వేసి, అందులో శుభ్రంగా కడిగి పెట్టుకొన్న కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

2. తర్వాత అదే పాన్ లో, 2చెంచాలా నూనె వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

3. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకనిముషం వేయించుకోవాలి . 

4. ఇప్పుడు అందులో టమోటో జ్యూస్ మరియు పెరుగు వేసి మరో నిముషం వేయించుకోవాలి.

5. ఇప్పుడు అందులో ఆమ్చూర్ మసాలా, కారం, ఉప్పు మరియు అరకప్పు నీళ్ళు పోసి మరో నిముషం వేయించుకోవాలి. 

6. మూత పెట్టి ఒక నిముషం వేయించుకోవాలి . ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకొన్నకాలీఫ్లవర్ వేసి వేయించుకోవాలి. 

7. తర్వాత చివరగా అందులో నిమ్మరసం మరియు ఆమ్చూర్ పౌడర్ వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసి తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి గా పుల్కా లేదా దాల్ రైస్ తో సర్వ్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *