ఫిష్ ఫ్రై తయారీ విధానం

Fish Fry Recipe, Manatelugunela, Fish Fry , Fish Fry Recipe in Telugu, Fish Fry in Telugu, Home Food, Healthy Food, fish fry recipe indian, fish fry recipe in telugu, fish fry recipe step by step, fish fry recipe, fish fry masala recipe, fish fry masala ,

చేప తినడం వలన చాల లాభాలు ఉన్నాయి, చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు. చేపలలో ఓమెగా 3, ప్రోటీన్, బి విటమిన్లు, సెలీనియం మరియు విటమిన్ డి వంటివి ఉన్నాయి. తాజా చేపల నుండి వచ్చే చేప ముక్కలను ఫ్రై చేసుకొని తింటే అనుభూతే వేరు. సాధారణంగా చేపలతో అనేక విధాలుగా వంట చేసుకుంటారు, కానీ ఫిష్ ఫ్రై వంటకం మరింత సంతృప్తి ఇస్తుంది. ఇక్కడ మీరు ఫిష్ ఫ్రై మసాలా (చేపల వేపుడు) చేసే పద్దతిని తెలుసుకోవచ్చు.

ఫిష్ ఫ్రై మాసాలకి కావలసినవి :

 • 5-6 చేప ముక్కలు (నీరు, ఉప్పు, పసుపు మరియు నిమ్మకాయలతో బాగా శుభ్రం చేసుకోవాలి)
 • 1/2 స్పూన్ పసుపు పొడి / హల్ది
 • 1 స్పూన్ కారం పొడి
 • 1 స్పూన్ జీలకర్ర పొడి / జీరా
 • 1 స్పూన్ వేయించుకున్న ధనియలు
 • రుచి ప్రకారం ఉప్పు
 • 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
 • 2-3 స్పూన్ నిమ్మ రసం
 • 3 టేబుల్ స్పూన్లు నూనె

అలంకణ కొరకు :

 • 3-4 నిమ్మ చెక్కలు
 • కత్తిరించిన కొత్తిమీర ఆకులు
 • ఉల్లిపాయ రింగులు

చేపని వాష్ చేసే పద్దతి :

మొదట చేపల ముక్కలను తీసుకోండి, వాటిని నీటితోకడగండి, తర్వాత చేపల ముక్కలకు ఉప్పు, నిమ్మరసం మరియు పసుపు బాగా పట్టించి కొన్ని నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వలన చేపల నుండి వచ్చే అవాంఛిత వాసన పోతుంది.

వెజిటబుల్ కిచిడీ (Vegetable Khichdi) తయారు చేయువిధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మసాలా ముద్దను తయారు చేయడం మరియు దానిని చేపలకు పూయడం:

 • ఒక గిన్నెలో, పసుపు పొడి, జీలకర్ర పొడి, మిరప పొడి, ధనియ పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటిని కలుపుకోండి.
 • మసాలా ముద్ద కు సరిపడే అంత నీటిని కలిపి, దీనిని మిక్స్ చేసి మందపాటి పేస్ట్ తయారు చేయండి.
 • ఇప్పడు కొంచెం మసాలా పేస్ట్ తీసుకోండి, మసాలా పేస్ట్ తో మొత్తం చేప ముక్క అంతట బాగా రాయండి. ఇలాగ అన్ని చెప్ ముక్కలకి మసాలా పేస్ట్ పట్టించుకోండి.
 • మసాలా పట్టించిన చేపముక్కలని 10-15 పక్కన పెట్టుకోండి, ఇలా చేస్తే మసాలా చేపకి బాగా పడుతుంది.

హైదరాబాదీ బిరియాని తయారు చేయువిధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేప ముక్కలు వేయించడం :
 • ఒక పాన్ లో, 3 టేబుల్ స్పూన్ నూనె వేసి, వేడిచేసుకోవాలి.
 • చేప ముక్కలను జాగ్రత్తగా  పాన్ వేసుకోవాలి,  వాటిని 5 నిమిషాలుఉడికించుకోవాలి.
 • తర్వాత  చేప ముక్కలు ఇంకో వైపుకి తిప్పండి  5 నిముషాలు సన్నని మంట  పైన  ఉడికించాలి.
 • మళ్లీ ఇంకోసారి చేప ముక్కలను తిప్పుకోవాలి, సన్నని  మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.
 • ఇలాగ చేప ముక్కలు బాగా కాలేవరకు సన్నని మంట పైన ఉంచాలి.బాగా కాలిన తర్వాత చేప ముక్కలను తీయండి.
 • బాగా వేగిన తర్వాత  చేప ముక్కలని ఒక ప్లేట్ లోకి తీస్కొని వాటికీ గార్నిష్ కోసం నిమ్మ చెక్కలు, ఉల్లిపాయ రింగులు మరియు తాజా కొత్తిమీర ఆకులు తో సర్వ్ చేస్కోండి.
 • వేడి వేడి చేప ఫ్రై రెడీ అవుతుంది . ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.