Andhra Pradesh History – History of Andhra Pradesh, Origin & History of Words

Andhra Pradesh History - History of Andhra Pradesh, Origin & History of Words
Andhra Pradesh Name History
 • ‘ఆంధ్ర’ పదం దేశపరంగా, జాతిపరంగా, భాషాపరంగా కూడా వర్తిస్తుంది.
 • భారతదేశ ప్రజలలో ఆంధ్రులు అతి ప్రాచీన జాతులలో ఒకరు.
 • ఆంధ్ర’ అనే ప్రాకృత పదాన్ని సంస్కృతీకరించడం వలననే’అంధ్ర, ‘ఆంధ్ర’ అనే పదాలు ఏర్పడ్డాయి.
 • ఈ రెండింటిలో ఆంధ్ర పదం ప్రాచీన రూపమని తామ, శిలా శాసనాల వల్లనూ, వాజ్మయం వల్లనూ తెలుస్తుంది.
 • ఆంధ్ర శబ్దం మొదట జాతి వాచకంగా వాడబడింది.
 • ఆంధ్ర శబ్దం, ఆంధ్రుల ప్రసక్తి మొట్టమొదట క్రీ.పూ. 1500 – 1000 మధ్య కాలం నాటి ఋగ్వేద బ్రాహ్మణమైన ‘ఐతరేయ’బ్రాహ్మణంలో కనపడుతుంది.
 • ఆంధ్రులు ఆర్యజాతికి చెందిన వారని, ఉత్తర భారత వాసులని ఐతరేయ బ్రాహ్మణం ద్వారా తెలుస్తుంది.
 • ఐతరేయ బ్రాహ్మణాన్ని బట్టి విశ్వామిత్ర సంతతి వారైన ఆంధ్రులు విశ్వామిత్రునిచే శపించబడి ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి వచ్చి పుండ్ర, శబరి, పుళింద మొదలగు జాతులతో పాటు నివసించారు.
 • బౌద్ద వాజ్మయంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన కలదు. ఆంధ్రుల నివాసం గురించి మొదటి సూచన బౌద్ధ జాతక కథలలో లభిస్తుంది. భీమసేన జాతకం ఆంధ్రాపథాన్ని ప్రస్తావించింది.
 • ఆంధ్రదేశాన్ని గురించిన మొదటి శాసన ప్రమాణమైన శివస్కందవర్మ మైదవోలు తామ్ర శాసనం (క్రీ.శ. 300) లో ధనకటకాన్ని ఆంధ్ర పథానికి రాజధానిగా పేర్కొంది.
 • అశోకుని శాసనంలో జాతిపరంగా ఆంధ్రశబ్దం ప్రస్తావించబడింది.
 • కణ్వ వంశస్థుడైన సుశర్మను వధించి శ్రీముఖుడు ఆంధ్ర రాజ్య స్థాపన చేసినట్లు మత్స్య, వాయు పురాణాల ద్వారా తెలుస్తుంది.
 • ఆంధ్రనగరి తెలివాహనదిపై ఉన్నది అని సెరివణిజ జాతకం చెప్పగా ఆ నది కృష్ణానది అని, అది బౌద్ధ క్షేత్రమైన ధాన్యకటకం అని కొందరి చరిత్రకారుల అభిప్రాయం.
 • క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం ఆరంభంలో పల్లవరాజుల ప్రాకృత శాసనాల్లో అంధాపథము అనే పేరుతో ఆంధ్రదేశం ప్రస్తావించబడింది.
 • క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో ఆంధ్రపదం జనుల పరంగా మౌఖరి వంశీయుల శాసనాల్లో వాడారు.
 • వరహమిహిరుడు తన ‘బృహత్సంహిత’లో. ఆంధ్రదేశం దక్షిణాపథంలో విదర్భ, విదేహ, ఛేది దేశాలకు దక్షిణంగా ఉన్నదని పేర్కొన్నాడు..
 • క్రీస్తు శకం ఏడో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు – హుయాన్ త్సాంగ్ తన సి-యు-కీ’ గ్రంథంలో గోదావరి కృష్ణానదుల మధ్యగల తీరాంధ్రదేశాన్ని ‘అన్-తో-లో’ (ఆంధ్ర)అని, పింగ్-కీ-లో (వేంగీ) దాని రాజధాని అని పేర్కొన్నాడు.
 • వైదిక వాజ్మయ కాలం నుండి క్రీస్తు శకం ఏడో శతాబ్దం వరకు గల ప్రాచీన భారతీయ వాజ్మయంలోను, విదేశీ రచనలలోను ఆంధ్రపదం దేశ వాచకంగానూ, జాతి వాచకంగానూ వాడబడింది.
 • ఆంధ్రులకు దక్షిణంగా ఉన్న తమిళులు ఆంధ్రులను ‘వడుగర్’ (ఉత్తరాది వారు) అని పిలిచారు.
 • తమిళ శాసనాల్లో ఆంధ్ర పదమునకు ‘వడుగవష్టి’ అని పేరు. వష్టి అనగా మార్గం.
 • తూర్పు చాళుక్యుల యుగంలో ‘ఆంధ్రదేశం’ అనే పేరు మరుగున  పడి వేంగీదేశం అని పేరు ప్రఖ్యాతి చెందింది.
 • దండి తన “దశ కుమార చరిత్ర” లో వేంగీని ‘ఆంధ్రనగరం’ అని పేర్కొన్నాడు.
 • తూర్పు చాళుక్యులు తమని వేంగీ పాలకులుగా పేర్కొన్నప్పటికీ, వారికి సమకాలికులైన ఛేది, కుంతల, చోళ దేశ పాలకులు చాళుక్యులను ‘ఆంధ్రాధిపతులు’ అనే పేర్కొన్నారు.
 • మొదట జాతివాచకంగానూ తరువాత దేశవాచకంగానూ వాడబడిన ఆంధ్ర పదం క్రీ.శ.1053లో నన్నయభట్టు రచించిన నందంపూడి శాసనంలో మొట్టమొదటగా భాషా వాచకంగా వాడబడింది.
 • తెలుగు అన్న మాట ఇప్పుడు ఆంధ్రమునకు పర్యాయపదంగా వాడుతున్నారు.
 • ‘తలైంగ్’ అనే కొలామీ పదమే తెలుగుకు మూలం అయ్యి ఉండవచ్చునని . కొందరి వాదన. ‘తలైంగ్’ అంటే నాయకత్వం వహించినవారని అర్థం.
 • క్రీస్తుశకం పదివందలకు పూర్వం -గల వాజ్మయంలో కానీ, శాసనాల్లో కానీ తెలుగు అనే పదం కనపడదు. తమిళ, కన్నడ శాసనములలోనూ ఆంధ్రవాజ్మయలోనూ తెలుగు పదం క్రీ.శ.11వ శతాబ్ది నుండే కనిపి స్తుంది.
 • శాసనాల్లో తెలుగు భుపాలురు, తెలుంగ, తెలింగకులకాల మొదలైన పదముల వలన తెలుంగ, తెలింగ పదాలు . జనవాచకం లేదా జాతి వాచకం అని తెలుస్తుంది.
 • పదకొండవ శతాబ్ది మధ్య కాలంలో పూర్వ చాళుక రాజరాజనరేంద్రుని ఆస్థానంలోని నన్నయ నాటికి ‘తె రూపాంతరంగా ‘తెనుగు’ వచ్చింది.
 • నన్నయ, నన్నెచోడులు తెనుగును భాషా పరంగా వాడారు.
 • పదమూడవ శతాబ్దిలోని మహ్మదీయ చరిత్రకారులు ఈ దేశాన్ని ‘తిలింగ్’ (తిలింగ) అని వ్యవహరించారు.
 • పదకొండవ శతాబ్దం తర్వాత ఆంధ్రదేశానికి ‘త్రిలింగదేశం) ” అని పేరు వచ్చింది.
 • కొందరు పండితుల అభిప్రాయం.
 • పాల్కురికి సోమనాథుడు తన ‘పండితారాధ్య చరిత్రలో ఈ దేశాన్ని “నవలక్షతెలుంగు’ (అనగా నవలక్ష గ్రామములు కల తెలుగు దేశం) అని పేర్కొన్నాడు.
 • వైదిక వాజ్మయం ఆంధ్రులు సాహసోపేతులైన సంకరజాతి అని సూచిస్తుంది.
 • పోర్చుగీస్ వారు తెలుగు భాషకు పెట్టిన పేరు ‘జెంటూ, జెంటూ అనగా ‘దేశీయం’ అని అర్థం.
 • ఈ విధంగా ప్రాచీనకాలంలో ఆంధ్రదేశానికి ఆంధ్రవని, త్రిలింగదేశం, తిలింగ, తెలంగాణ అనే పేర్లు ఉండేవి.
 • ఆంధ్రభాషకు ‘తెలుగు, తెనుగా ‘తెలుగు, తెనుగు, జెంటూ, ఆంధ్రం అనే పేర్లు ఉండేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *