పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేయలేను : హరీష్ శంకర్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ నడుస్తుంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ. నిర్మాత దిల్ రాజు పవన్ ను ఒప్పించి రీమేక్ చేస్తున్న  ‘పింక్’ మూవీని డైరెక్ట్ చేయమని మొదట హరీష్ శంకర్ కు దిల్ రాజ్ నుండి ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ కు హరీష్ శంకర్ దానికి ఆసక్తి కనపరచలేదు టాక్ సినీ సర్కిల్ లో నడుస్తుంది.

గబ్బర్ సింగ్ ఘన విజయం తరువాత, ఆ చిత్రానికి సీక్వెల్ వచ్చిన చిత్రానికి హరీష్ శంకర్ ను కాదని పవన్ బాబీ కి ఛాన్స్ ఇచ్చాడు. దీనికి కారణం వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్న భేదాభిప్రాయాలే కారణం అన్న వార్తలు గతంలో వచ్చాయి.  పవన్ తనకు దేవుడుతో సమానం అంటూ,  ఆవార్తలు వచ్చినప్పుడల్లా వాటిని ఖండిస్తూ వచ్చాడు హరీష్ శంకర్.

హరీశ్ శంకర్ ఇపుడు పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చేయక పోడానికి కారణం ‘పింక్’ రీమేక్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి సరిపడ రేంజ్ చిత్రం కాదని, అలాంటి మూవీకి దర్శకత్వం చేయదల్చు లేదని దిల్ రాజ్ కు చెప్పినట్లు టాక్.

ఇంకా దిల్ రాజు పింక్ ప్రాజెక్ట్ ని వేణు శ్రీరామ్ కు అప్పగించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.