ఇట‌లీ, మిలాన్‌లో మెహరీన్ తో రొమాన్స్ చేస్తున్న గోపిచంద్.!

గోపీచంద్ హీరోగా మెహ‌రీన్ హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం చాణక్య‌. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వాన‌ ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తిరు, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తుండగా, వెట్రి కెమెరామెన్ గా పని చేయనున్నాడు.