కుప్పకూలిన బంగారం ధరలు..!

నిన్నటి వరకూ కొండమీద కూర్చొన్న పసిడి ధర ఒక్కసారిగా దిగొచ్చింది. ఒక్క రోజుల్లోనే ఏకంగా రూ.2,500 తగ్గింది. ప్రస్తుతం ఈరోజు మార్కెట్‌లో 24 క్యారెట్ల పదిగ్రాములు ధర రూ.37,000లు గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల తులము (పదిగ్రాముల) ధర రూ.35 వేలుగా ఉంది. దీంతో బంగారు ప్రియులు అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ట్రెండ్ వున్నప్పటికీ ప్రస్తుతం రిటైలర్ల డిమాండ్‌ పడిపోవడంతో ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు వెల్లడించారు.

ఆర్థికంగా అగ్రరాజ్యాలైన అమెరికా మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ప్రభావమే ప్రస్తుతం బంగారం ధర తగ్గుముఖం పట్టినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గడిచిన పదిరోజులు వరుసగా పైపైకి ఎగబాకిన పసిడి ఉన్నటుండి ఇప్పుడు ఒక్కసారిగా రూ.2,500 తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటివరకూ తులం బంగారం దాదాపు రూ.40 వేల వరకూ ఎగిసిపడింది. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందని అందరూ అంచనా వేసినా. అనుకోని రీతిలో కిందకు దిగిరావడంతో బంగారు ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపారు. కాగా…కిలో వెండి కూడా రూ.690 తగ్గి రూ.44,310గా స్థిరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *