గబ్బర్ సింగ్ నటుడికి గాయాలు !

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా లో రాజశేఖర్ గారి మేనరిజమ్స్ తో నటించి మంచి పేరును సంపాదించికున్నారు, శనివారం రాత్రి అంజనేయులుకి రోడ్ ప్రమాదంలో గాయాలు అయ్యాయి,

వివరాలలోకి వెళ్తే ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న అనజనేయులు అవసరం నిమిత్తం తన భార్యతో ద్వీచక్ర వాహనంలో ఇందిరా నగర్ నుండి గచ్చిబౌలి కి వెళ్తుండగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర గుర్తుతెలియని కార్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది , అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయట పడ్డారు, పోలీస్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, కార్ వివరాలకోసం సీసీ టీవీ ని చెక్ చేస్తున్నారు పోలీస్ వారు !