పవన్ కళ్యాణ్ వక్తిత్వం పైన కామెంట్స్.. !

నువ్వెంత పిచ్చి ఎమోషనల్ ఫూల్ కాకపోతే నాలాంటి వాడు విజయవాడలో చిన్న ఇల్లు కోనేంత డబ్బును వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి వెళ్లి టీంకి లక్ష చొప్పున, కార్పస్ ఫండ్ కింద కోటి రూపాయలు అనౌన్స్ చేస్తావ్…నాకైతే సుమారు నా జీవిత కాల సంపాదన

ఇంటిముందుకొచ్చి ఆరోగ్యం బాగా లేదంటే పావలా శ్యామలకు లక్ష ఇస్తావా పిచ్చోడా…అదే నేనైతే 500 ఇచ్చి ఒక సేల్ఫీ తీసి fb లో పెట్టి మిగిలిన వాటితో Iphone X కొనుక్కునే వాడిని..దాని కెమెరా ఎంత బావుంటుందో…

అసలు నీకీ పిచ్చి మొదటినుండి వుందనుకుంటా లేకపోతె ఖమ్మం నుండి ఆవిడెవరో వృద్దాశ్రమం అని వస్తే నాలగు దుప్పట్లు, ఆరు డజన్ల పళ్ళు ఇచ్చి పంపక 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తావా అది చాలా దన్నట్లు అవసరమైతే నాకు phone చేయండి అంటావా సిగ్గుందా నీకసలు.

మీ అన్న పార్టీ ప్రచారానికి పోయి తెలంగాణాలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని బోర్ వేయిస్తావా.. ఆ డబ్బుతో నాలుగు ఓట్లు కొనుక్కోవచ్చన్న బుద్ది లేకపాయే

మొన్న ఎలక్షన్స్ పార్టీ పెట్టావ్ సరే పెట్టినోడివి ఎవరో “మేధావి” అనుకుని మంచి చేస్తాడని సపోర్ట్ చేస్తివి..ఆ పార్టీ గెలిచాక ఏ రాజ్య సభ సీటో ఏ మంత్రిపదవో పొందక 5 ఏళ్ళు ఏం పీకుదామని బయటున్నావ్…

సినిమా కు 20 కోట్లు తీసుకుంటూ నిర్మాత ఖర్చుతో జీవితాన్ని సాగించక గెలుస్తావో గెలవవో తెలియని రాజకీయంలోకి నీ డబ్బులు తగలేసుకోడానికి ఎందుకొచ్చినట్టు.. నీ ఎమోషనల్ పిచ్చికి పరాకాష్ట ఇది. అదే నేనైతే happy గా ఏ లంబోర్గినినో ఏ ఫెరారీనో కొనుక్కుని సిగ్నల్ దగ్గర అరిపిస్తూ లోపలనుండి జనం రియాక్షన్స్ వీడియో తీస్తూ fb లో పోస్ట్ చేసేవాడిని.

అన్నిటికన్నా ముక్యం నువ్వెంత తెలివితక్కువ వాడివో తెలిపే పని 3పెళ్ళిళ్ళు చేసుకోవడం..నువ్వు అసలు ఈ దేశం లో పుట్టావన్న మాటే కానీ ఒక్క పద్దతీ ఒంటపట్టించుకోలేదేందని..పెళ్ళాం నచ్చక పొతే, ఎదురు చెప్తే కనిపించని పరువు కోసం calm గా వుండి నాలుగు పీకో, పీకిన్చుకునో నాలుగు గోడల మధ్య తన్నుకుంటూ బయటికి వచ్చినప్పుడు నవ్వుకుంటూ నీ చిలక్కొట్టుడు వ్యాపకాలు ఏమైనా ఉంటే చాలామంది ‘సూపర్ హీరోల్లా’ సాగించకుండా ఆడవాళ్ళ ఆలోచనలకు విలువ ఇచ్చి, వాళ్ళను కూడా మనుషులుగా చూస్తూ కుదరదు అంటే విడాకులు ఇచ్చి తరువాత పెళ్లి చేసుకుంటావా..నీ తెలివేందో ఇక్కడే తెలుస్తుంది.

హుదుద్ తుఫాన్ కి డబ్బులు, ఉత్తరాఖండ్ కి డబ్బులు, ఫ్రీడమ్ ఫైటర్స్ కి పాతిక వేలు, ఒలంపిక్ ట్రైనీ కి 5 లక్షలు, పిల్లాడి కాన్సర్ ట్రీట్మెంట్ కి డబ్బులు,అన్నీ రాసే ఓపిక లేదు కానీ, ఈ లెక్కన యెంత డబ్బు తగలెట్టావ్…అసలు నీకు డబ్బు విలువ తెలుసా…వీటిని లెక్కేస్తుంటే ఈ డబ్బు ఎకౌంటు లో వేసుకుని వడ్డీ మీద నేను నా పిల్లలు మన ఫేస్బుక్ అబ్యుదయవాదుల్లా, ఇరేషనల్ రేషనల్ థింకర్స్ లా బిల్డుప్ లు ఇస్తూ నీ లాంటి వాళ్ళని పిండి ఆరేస్తూ హాప్పీ గా fb లో పోస్ట్స్ పెట్టుకుంటూ బ్రతికేవాళ్ళం.

ఇరవయ్యేళ్ళు అన్నం తినకుండా వున్న ఇరోం షర్మిలా కే మూడొందల వోట్లు వేసినోళ్ళం,. నీకైతే ముఫై కూడా వేయము..కాబట్టి వెళ్లి మళ్ళి సినిమాలు తీసుకో ఆ డబ్బును అవసరం ఐనోడికి ఇచ్చుకుంటూ కూర్చో..డబ్బులు సరిపోకపోతే adds కూడా చేసి ఇంటికోచ్చినోడికి ఇబ్బందిపడేవాల్లకు సాయం చేసుకో. ఎప్పుడైనా నాకు దూలెక్కి నిన్ను తిడితే తిరిగి నన్ను తిట్టే నీ ఫాన్స్ ని కంట్రోల్ లో ఉండమని వాళ్ళు అలా తిట్టినందుకు నాకు బాధ కలిగించినందుకు నాకు సారీ చెప్పడం మాత్రం మర్చిపోకు.

Written by Srikar Devaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *