ఈ చిట్కాలు పాటిస్తే మధుమేహాన్ని నిరోధించవచ్చు..!

ఆధునిక కాలంలో మనం సేవించే ఆహారంలో లోపం వలన చిన్నా పెద్ద వయసుతో సంబందం లేకుండా మధుమేహం (షుగర్) వ్యాధి బారిన పడుతున్నావారు రోజురోజుకు పెరుగుతూనీవున్నారు.

సాధారణంగా మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం మందులు వాడాల్సిందే అని మనకి తెలుసు. కానీ ఇక్కడ వివరించిన చిట్కాలను పాటించటం వలన వ్యాధి తీవ్రతలను చాలావరకు తగ్గించవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు గమనించినట్లైతే, మొదటగా మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేయవలసిన అవసరంఎంతోఉంది. మంచి పోషకాహార నిపుణులని కలిసి తమకు తగినట్లు ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి.

నిపుణులు సూచించిన విధంగా నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు అని సూచించారు.

1. మీరు తీసుకునే రోజూవారీ ఆహారంలో అదనంగా, కార్బోహైడ్రేట్లను వీలైనంత తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్లను తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2. మీ దినచర్యగా వ్యాయామాల చేయడం వలన మధుమేహ వ్యాధి మాత్రమే కాక పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది వైద్యులు సూచించారు.

3. మీ శరీర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం. బరువు తగ్గటం వలన మీ శరీరం ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా మారుతుంది అని చెబుతున్నారు.

4. కాకరకాయను కూరగా లేదా రసం (జ్యూస్) రూపంలో సేవించడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు సాధారణ వ్యక్తుల రక్తంలోని చక్కెర స్థాయిలలో మార్పులు సంభవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

5. మనకు పుష్కలంగా లభించే పచ్చని ఆకుకూరలు తినటం వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా మధుమేహం కూడా తగ్గించబడుతుందని కొన్ని పరిశోధనలలో వెళ్ళడయింది. ఈ పరిశోధనలలో పచ్చని ఆకుకూరలను తినటం వలన చాలావరకు మధుమేహం బారి నుండి బయటపడవచ్చని వైద్యులు తెలిపారు.

6. తమ దినచర్య ప్రణాళికలో ఆహారంతో పాటు వ్యాయామాలు చేయడం వలన మధుమేహ వ్యాధిని తగ్గించవచ్చునని చేర్చబడింది. ప్రతిరోజు 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామలు చేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గటమే కాకుండా, ముఖ్యమైన కణజాలాలను మరింత సున్నితంగా మారుస్తుంది స్ని వైద్యులు చెబుతున్నారు.

  • 5
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *