షాకింగ్ వీడియో : మోసళ్ళతో ప్రాణాల కోసం పోరాడిన మహిళ

మనం హాలీవుడ్‌లో చిత్రాలను గమనిస్తే జంతువుల నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్రాల‌కి పబ్లిక్ లో ఎంత‌టి ఆద‌ర‌ణ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవల తాజాగా విడుదలైన మొస‌ళ్ళ నేప‌థ్యంతో “అలెగ్జాండ్రి అజా క్రాల్” అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల ఆకట్టుకొని, రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో ఇళ్ళ‌న్ని నీటిలో మునుగుతాయి. వ‌ర‌ద‌లతో వలన నీటితో పాటు మొస‌ళ్ళు కూడా ఇళ్ళ‌ల్లోకి చేరడాని కళ్ళకి కట్టినటుగా తెరకెక్కించారు.

ఒక్క ఇంట్లో మొస‌ళ్ళ మ‌ధ్య ఇరుక్కుపోయిన మహిళన కాప‌డ‌డానికి వ‌చ్చిన వారంద‌రు మొసళ్ళు కి ఆహారం అయిపోతుంటారు. చివరికి ఆ మ‌హిళ సుర‌క్షితంగా మొస‌ళ్ళ‌నుండి ఎలా తప్పించుకొని బ‌య‌ట‌ప‌డింద‌నే దానిని క్రాల్ చిత్రంలో చూపించ‌నున్నారు. ఈ సినిమాని పారామౌంట్‌ పిక్చర్స్‌ సమర్పిస్తుంది. క్రెయిగ్‌ జె ఫ్లోరిస్‌, శామ్‌ రైమీలు చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *