మూవీ రివ్యూ : చిత్రాలహరి

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేత పేతురాజ్ తదితరులు.

దర్శకత్వం : కిషోర్ తిరుమల

నిర్మాత : నవీన్ యెర్నేని , వై రవిశంకర్, మోహన్ చెరుకూరి

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సాయి ధరం తేజ్..6 వరుస మూవీల ఫెయిల్యూర్ తరువాత సాయి తేజ్ గా పేరు మార్చుకుని చేసిన సినిమా చిత్రలహరి. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా హీరో సునీల కమిడిన్ నటించిన మూవీ చిత్రలహరి దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో స్టోరీ లోకి వెళ్తే

కథ :

జీవితంలో లో అసలు సక్సెస్ అనేదే తెలియని విజయ్ ఎన్నో పనులు చేస్తున్నా అవి సక్సెస్ అవ్వవు. ఇక ఈ ప్రయత్నంలో లహరి (కళ్యాణి ప్రియదర్శిని) చూసి ఇష్టపడతాడు విజయ్. లహరి కూడా విజయ్ ను ఇష్టపడుతుంది. కళ్యాణి ప్రియదర్శిని కి తాగే వాళ్లు అంటే ఇష్టం ఉండదు అయితే ఓ సందర్భంలో విజయ్ ని తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విని బార్ లో తాగడం చూసి లో షాక్ అవుతుంది.

తరువాత విజయ్ లవ్ ని దూరం చేస్తుంది. లవ్ లో కూడా ఫెయిల్ అయిన విజయ్ కు తన ప్రాజెక్ట్ ప్రయత్నం లో చిత్ర పరిచయం అవుతుంది. ఆమె విజయ్ తయారు చేసిన యాక్సిడెంట్ అలర్ట్ సిస్టెం డివైజ్ స్టార్ట్ అప్ కోసం హెల్ప్ చేయాలని అనుకుంటుంది. కాని అది కుడా ఫెయిల్ అవడంతో విజయ్ పూర్తిగా డిప్రషన్ లో కి వెళ్లిపోతాడు తన నాన్న చెప్పిన మాటలకి మోటివేషన్ అయి మల్లీ తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి యాక్సిడెంట్ అలర్ట్ సిస్టెం ప్రయోగాన్ని చేసేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా స్పీడ్ డ్రైవ్ చేసి ఆక్సిడెంట్ చేసుకుంటాడు ఆ అప్ వర్క్ అవడం తో విజయ్ హాస్పిటల్ లో జాయిన్ అయి క్షేమం గా బయట పడతాడు .. దానితో ఆలా చేయడం తప్పు అన్ని విజయ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్ట్ లో కేసు వాదోపవాదాలు విన్న జడ్జ్ విజయ్ ని వదిలేసాడా ఆ ప్రాజెక్ట్ విజయవంతం అయింది ఆ అన్నది మూవీ ధియేటర్ లో చూడాలి

నటీనటుల ప్రతిభ :

మసాయి తేజ్ విజయ్ పాత్రలో చాలా బాగా నటించాడు చాలా పరిణతి కలిగిన నటనతో అందరిని మేపించాడు.చాలా సెటిల్డ్ గా సినిమా చేశాడు. ఇక సినిమాలో హీరోయిన్స్ కళ్యాని ప్రియదర్శి, నివేదా పేతురాజ్ పోటీపడినటించారు అనిపించారు. కళ్యాణి క్యూట్ లుక్స్ ఇంప్రెస్ చేస్తాయి. అయితే హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.ఇక పోసాని నాన్న పాత్రకి న్యాయం చేసాడు సునీల్, కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు మిగిలిన నటులు పరిధి మేరకు నటించి మెప్పించారు

సాంకేతికవర్గం పనితీరు :

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా ఆన్ స్క్రీన్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. రెండు సాంగ్స్ బాగున్నాయి. బిజిఎం కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. శేఖర్ ప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు ఇంకాస్త వెనుక పడ్డాడు అనిపిస్తుంది . మైత్రి మూవీస్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్లస్ పాయింట్స్ :

సాయి తేజ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

హీరోయిన్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

స్లో నేరేషన్

కామిడీ ట్రాక్

తీర్పు : ఒకసారి చూడాలి అనిపించే చిత్రలహరి.

రేటింగ్ : 2.75/5

Written by Karthik!!

  • 24
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *