కొరటాల శివ చిత్రం కోసం సాహసం చేస్తున్న చిరంజీవి.?

సురేందర్ రెడ్డి దర్శకత్వం చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమా షూటింగును పూర్తిచేసే పనిలో చిత్ర టీం. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నాయికగా నయనతార నటిస్తోంది అలాగే ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి .. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే, అయితే ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన లాంచ్ చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ కొరటాల శివ వున్నారు. సినిమా లాంచ్ తరువాత ఒకటి రెండు రోజుల గ్యాప్ తీసుకుని, రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. సామాజికపరమైన సందేశంతో కూడిన కథ ని చిరు కోసం తయారుచేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తారు అని, అందులో ఒక క్యారెక్టర్ లో రైతుగా కాగా కనిపించనున్నారని చెబుతున్నారు. అయితే ఇంకో క్యారెక్టర్ కోసం చిరంజీవి తన లుక్ టోటల్ గా మార్చుకోనున్నాడు దీనికోసం బరువు తగ్గి యంగ్ లుక్ లో కనిపించనున్నాడు. శృతి హస్సన్, తమన్నా మరియు నయన తార వీరిలో ఒకరు చిరు కు జోడిగా నటించనున్నారు.