IAFలో చినూక్ హెలికాప్టర్‌లు, భారతదేశానికి ఎలా ఉపయోగపడనున్నాయి.!

Indian Air Force inducts four Chinooks, Indian CH-47 Chinook helicopter, Boeing CH-47 Chinook, Chinook helicopters arrive in India from US, Mana Telugu Nela, Manatelugunela, India Takes Chinook Helicopters, Indian Air Force,

భారత వైమానిక దళం (IAF) తన హెలికాప్టర్ల బలగాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ రోజు చినూక్ హెలికాప్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టారు.

భారతదేశానికి భద్రతాపరమైన సవాళ్లు చాలా ఉన్నాయని, క్లిష్టమైన భూభాగంలో వాయుమార్గంలో భారీ ఆయుధ సామగ్రి, ఇతరత్రా సమగ్రిబ్తరలించే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చండీగఢ్‌లో ఎయిర్ ఫోర్స్ 12 వింగ్‌లో తెలిపారు.

ఐఏఎఫ్‌లో(IAF) చినూక్ హెలికాప్టర్ల చేరికతో సంక్లిష్టంగా ఉండే ఎంతో ఎత్తైన ప్రదేశాలకు వీటిని తరలించే సామర్థ్యం అసాధారణoగా పెరిగిందని బీఎస్ ధనోవా తెలిపారు.

సైనిక ఆపరేషన్లలో శతఘ్ని వంటి హెలికాప్టర్లు ఫిరంగి లాంటి భారీ ఆయుధాల ఒక ప్రాతం నుంఫై మరో ప్రాంతానికి సులభంగా తరలింపులోనే కాదు, సుదూర ప్రాంతాల్లో విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉపయోగపడతాయని ధనోవా వివరించారు.

2015లో ఆర్డర్ ఇచ్చిన భారత్

అమెరికాలోని ప్రముఖ విమాన తయారీ ఐన బోయింగ్ సంస్థ నుంచి పదిహేను సీహెచ్-47ఎఎఫ్ చినూక్ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు 2015 సెప్టెంబరులో అమెరికా మరియు భరత్ ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. వీటిలో నాలుగు హెలికాప్టర్లు ఇ సోమవారం భారత వైమానికదళంలో చేరాయి. మిగతా 11 హెలికాప్టర్లు వచ్చే ఏడాదిలోగా భారత్‌కు వచ్చే అవకాశముంది అని అధికారులు తెలిపారు.

భారత సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా కీలకమైన రహదారుల నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల్లోనూ చినూక్ హెలికాప్టర్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని వైమానిక దళ అధికారులు చెబుతున్నారు.

సాధారణ సైనిక హెలికాప్టర్‌తో పోలిస్తే చినూక్ హెలికాప్టర్‌లో ప్రత్యేకతలు ఏమిటంటే- ఇది పెద్దస్థాయిలో బరువును సులువుగా మోసుకెళ్లగలదు. దీనికి జంట రోటర్లు ఉంటాయి. అమెరికాలోని డెలవేర్‌లో చినూక్ హెలికాప్టర్లపై ఇటీవల నాలుగు వారాలపాటు శిక్షణ పొందిన భారత పైలట్ ఆశిష్ గహ్లావత్ ఈ విషయం అధికారికంగా తెలిపారు.

19 దేశాల్లో వాడుతున్న సైనిక బలగాలు

”సింగిల్ రోటర్‌ ఉండే హెలికాప్టర్లు వాడుతున్నారు. అయితే దీనికి రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇదో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం” అని ఆశిష్ గహ్లావత్ చెప్పారు.

అన్ని రకాల క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్ సొంతo అని నిపుణులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన కొన్ని ప్రదేశాల్లో పనిచేసే భారత వైమానిక దళానికి ఇది కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.

చినూక్ హెలికాప్టర్ల చేరికతో సరిహద్దుల్లో మరియు నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన ప్రదేశాల్లోకి త్వరితగతిన ఫిరంగులతోపాటు బలగాలను తరలించే సామర్థ్యం పెరుగుతుందని వాయుసేన అధికారులు చెబుతున్నారు.

చినూక్ హెలికాప్టర్లతో గరిష్ఠంగా 11 టన్నుల పేలోడ్‌ను, 54 మంది బలగాలను తరలించగల సామర్థ్యం ఈ చాపర్‌కు ఉందని శిక్షణ పొందిన భారత పైలట్ ఆశిష్ గహ్లావత్ దీనికి ఉన్న మూడు కొక్కేలను(హుక్స్) చూపిస్తూ వివరించారు.

ఈ హెలికాప్టర్‌ను ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల్లో సైనిక బలగాలు వాడుతున్నాయి అని తెలిపారు. భారత్ ప్రస్తుతం ఆపరేషన్లలో సోవియట్ మూలాలున్న ఎంఐ-26 హెలికాప్టర్లను వాడుతోంది అని భారత వాయుసేన అధికారులు ధృవీకరించారు.

  • 6
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *