ప్రేమ పేరుతో మోసం చేసాడు అని ప్రియుడి ఇంటి ముందు అమ్మాయి ధర్నా !

ప్రేమ అనేది ప్రపంచం లో స్వచ్ఛమైనది ఇది వయసుతో సంబంధం లేకుండా ఉంటుంది , ప్రేమ అనే భావనను కొందరు జీవితం గా భావిస్తే మరికొందరు తమ స్వార్థం కోసం ఉపోయోగిస్తున్నారు , ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోతుంది, ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే

ప్రేమ పేరుతో తనని మోసం చేసాడు అని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా కి దిగింది రాత్రి అంత ప్రియుడి ఇంటి ముందే ధర్నాకి దిగింది , వివరాల్లోకి వెళ్తే కృష్ణ జిల్లా ఇంబ్రహీంపట్నం మండలం కీలేశపురానికి చెందిన పచ్చిగోళ్ల జోసెఫ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మీ అనే యువతి సోమవారం రాత్రి నుంచి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

గతంలో ఈ విషయమై పోలీసులకి ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు అని వాపోయింది , జోసెఫ్ కి తనకి 3 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది అని అది కాస్తా ప్రేమ గా మారింది,

ఎప్పుడు పెళ్లి విషయం ప్రస్తావించిన జీవితం లో స్థిరపడ్డాక చూద్దామని జోసెఫ్ చెప్పాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో తాను గర్భం దాల్చానని అప్పటి నుంచి పెళ్లి గురించి ప్రస్తావిస్తుండగా దానిని అతను సమాధానం ఇవ్వకుండ ఉండేవాడు అని పేర్కొంది,

అయితే ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న జోసెఫ్ ఇంటి నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు, తనకి ఎవరు సపోర్ట్ రాకపోవడం తో కింత మంది స్థానికులు మరియు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు ,

  • 1
    Share