‘RRR’ లో ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది..?

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం #RRR ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి నుండి అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న ఏమిటంటే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్,రామ్ చరణ్ లలో ఎక్కువ ఎవరు హైలైట్ అవుతారు అని , అయితే రాజమౌళి ఇద్దరినీ బాలన్స్ చేస్తారు అనే సమాధానం వినిపిస్తుంది.కానీ ఈ సినిమా ఇన్ సైడర్స్ ఇస్తున్న హింట్స్ మెగా మాత్రం అభిమానులని షాకింగ్ లో పండిస్తున్నాయి .

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అంతా ఎన్టీఆర్ పై డిజైన్ చేసాడట రాజమౌళి. కొమురం భీం(ఎన్టీఆర్) లో ఉన్న ఆ ఆవేశంతోనే అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్)కూడా విప్లవం వైపు అడుగులేసినట్టు చూపిస్తున్నారు. అయితే అల్లూరి లాంటి వ్యక్తి స్వాతంత్ర విప్లవం వైపు నడవాలంటే కొమురం భీం పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ సినిమా విషయంలో అదే జరిగింది అంటున్నారు. కథాపరంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ కి స్కోప్ ఎక్కువ ఉందని, అలానే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.

చరణ్ మేకోవర్ లో పెద్ద మార్పులు ఏమీ ఉండవు,మనకు తెలిసిన అల్లూరి లానే చూపించబోతున్నాడు అంటున్నారు. అయితే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మొత్తం ఎన్టీఆర్ పైనే డిజైన్ చేయడం విశేషం. చరణ్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ నుండి ఎన్టీఆర్ క్యారెక్టర్ డామినేట్ చేసేలాగా ఉంటుందని సమాచారం. మొత్తానికి రాజమౌళి మొదట చేపినట్లు సినిమాలో చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్ లు రెండు సమానంగానే ఉండేలాగా తీర్చిదిద్దాడు అనే విషయం అర్థం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *