దయచేసి అనుమతి ఇవ్వండి అంటూ జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏమిటంటే తన నివాసం వద్ద ఉన్న ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తాను ఉంటున్న నివాసంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. యాజమాన్యం షరతుల మేరకు ఇంటిని వినియోగించుకుంటున్నానని లేఖలో వివరించారు. పక్కనే ప్రజావేదిక ఉన్నందున తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యకలాపాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉండవల్లిలోని ఓ ప్రైవేటు భవనంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.

మరి చంద్రబాబు నాయుడు పంపిన లేఖ పైన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.