కర్నూలు ఖాళీ అవుతోంది..బ్రహ్మంగారు ముందే చెప్పినట్లుగానే..!

చరిత్ర చూసుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అందరికి తెలిసిందే. కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు తెలిపారు. భూమి ఎలా అంతం అవుతుంది. ఎలాంటి వ్యక్తులు భూమిపై ఉన్నారు. ఎవరి వలన భూమి అంతం అవుతుంది అనే విషయాల గురించి కాలజ్ఞానంలో ప్రస్తావించారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నాయి. భూమిపై అతి వృష్టి, అనావృష్టి అనే రెండు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయని, అతి వృష్టి వలన ప్రజలు చాలా వరకు మరణిస్తారని చెప్పారు.

అయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దేశంలో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నార్త్ సౌత్ అన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా కొంతకాలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా తుంగభద్రా నది ఒక్కసారిగా ఉప్పొంగి పొంగుతున్నది. వరద భీభత్సానికి ప్రజలు అతలాకుతలం అవుతున్నాది మనం చూస్తూనే ఉన్నం. ప్రస్తుతం కర్నూలు నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా తుంగభద్రా నీరు కర్నూలులోకి వచ్చింది.

ఎగువనుంచి ఊహించని స్థాయిలో ఇంకా భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో తుంగభద్రా నది ఉగ్రరూపం మరింతగా దాల్చే అవకాశం ఉన్నది అని స్పష్టంగాతెలుస్తోంది. దీంతో కర్నూలు ప్రజలను అక్కడి ఉన్నత అధికారులు అప్రమత్తం చేశారు. వీలైనంత త్వరగా నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేయాలనీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్రా మరింత ఉగ్రరూపం దాలిస్తే కర్నూలు మొత్తం నీట మునుగుతుంది అధికారులుచెబుతున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అక్కడినుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది అక్కడి నుంచి కదిలేందుకు అంగీకరించడం లేదు. మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కాబట్టి తుంగభద్రకు వరద నీరు మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2009 లో వచ్చిన వరదలకు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారీ నష్టం జరిగింది. మరలా అలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.