మైనర్ బాలికలతో ఎమ్మెల్యేల జల్సాలు…వీడియో వైరల్..

భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని మోరెహ్ పట్టణంలో బీహార్ ఎమ్మెల్యేలు అమ్మాయితో నాట్యం చేస్తున్న వివాదాస్పద వీడియో బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో నలుగురు ఎమ్మెల్యేలు అమ్మాయిలతో తెలుసు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు జేడీయు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్ ఒక అమ్మాయి భుజం మీద బలవంతంగా చేయి వేయడానికి ప్రయత్నిస్తున్నాడు . ఎమ్మెల్యే చేతి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది అలాగే ఆమె చేతులు పట్టుకొని డాన్స్ చేస్తూ ఆ అమ్మాయికి ఏదో తాగిస్తున్నారు. ఆమెను మత్తులో ఉంచి హత్తుకొనేందుకు కూడా ప్రయత్నించారు.

ఆ అమ్మాయి ఇంకా మైనారిటీ కాదని, అలాంటి అమ్మాయితో రాజకీయ నాయకులు అసభ్యంగా ప్రవర్తించడం పైన దేశ ప్రజల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంఫాల్ టైమ్స్ లో ప్రచురించిన వార్తా కథనం ప్రకారం, స్టడీ టూర్ పై మణిపూర్ వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు జల్సాలు చేస్తూ కెమెరాకు దొరికినట్లు సమాచారం.