రిజల్ట్స్ : ఏపి ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల..

ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్స్ట్ ను అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఈ సంవత్సరం(2019) ఫస్ట్ మొదటి సరిగా.. ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేస్తున్నారు. పోయిన సంవత్సరం (2018)లో ఫస్టియర్ కి గ్రేడింగ్‌ విధానం అమలు చేయగా.. ఈసారి సెకండియర్ ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు సెకండియర్ పరీక్షలు జరిగాయి. 1,423 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి 10,17,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాల కోసం వెబ్ సైట్లు..

www.manabadi.com

www.schools9.com

www.results.apcfss.in

www.bieap.gov.in

www.jnanabhumi.ap.gov.in

  • 3
    Shares