తప్పుడు వార్తల ప్రచారంపై ఘాటుగా స్పందించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం

ఇటీవల కొద్దీ రోజులుగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘాటుగా స్పందిచింది. పెట్టుబడిదారులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ ఏపీని వీడుతున్నట్లు వచ్చిన వార్త కథనాలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.

విషపూరితమైన ఇలాంటి ప్రయత్నాలను గమనిస్తున్నామని, గమనిస్తూనే ఉంటామని హెచ్చరించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అవినీతిరహిత రాష్ట్రంగా, పారదర్శక విధానంతో దూసుకెళ్తుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేలా వివిధ సంస్థలను ప్రోత్సహిస్తోందని వివరించింది. ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ యాజమాన్యంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.