ఆఫర్లు లేక కమిట్ అయిన అనుపమా !

అఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఆతరువాత తెలుగులో కొన్ని మంచి ఆఫర్లనే రాబట్టుకుంది. అయితే అందులో ఒక శతమానం భవతి మాత్రమే హిట్ అవ్వడంతో ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇప్పుడు తన దగ్గరకు పెద్దగా స్కోప్ లేని పాత్ర వచ్చిన ఒకే చెప్పిందని సమాచారం.

[penci_ads id=”penci_ads_1″]

ఇక విషయానికి వస్తే బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ రాక్షసన్ ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ నటించనుందట. అయితే ఒరిజినల్ వెర్షన్ లో అమలా పాల్ చేసిన ఈ పాత్రా కు పెద్దగా స్కోప్ ఉండదు. కథ అంత విలన్ హీరోల చుట్టూనే తిరుగుతుంది.అలాంటి పాత్రకు ఇప్పుడు అనుపమ ఓకే చెప్పింది. మరి ఈ సినిమా ఆమె కెరీర్ కు ఎంత వరకు ఉపోయోగ పడుతుందో చూడాలి.