ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ

మతం

ఆంధ్రదేశంలో వైదికమతం, బౌద్ధం, జైనం, వీరశైవం, విశిష్టాద్వైతం, ఇస్లాం, క్రైస్తవ మతాలతోబాటు, నాస్తిక మతం, బ్రహ్మ, ఆర్య సమాజాలు, సిక్కు మతం మొదలైనవన్నీ ఆదరించబడుతున్నాయి. క్రీ.పూ.800 ప్రాంతంలో ఉత్తర భారతం నుంచి వచ్చిన ఆంధ్రులనే తెగ అప్పటి స్థానిక తెగగా ఏర్పడి వైదిక మతాన్ని దక్షిణాన వ్యాప్తి చేసింది. తర్వాత బౌద్దం, జైనం – రాగా 1300 ప్రాంతంలో అడుగు పెట్టిన ఇస్లాం ఈనాటికీ | సజీవంగా ఉంది. 18వ శతాబ్దం ప్రారంభంలో క్రైస్తవం ఆంధ్రదేశంలో | వ్యాపించింది. ఈ మతాలన్నింటికి మన రాష్ట్రంలో సమానమైన గౌరవం, , | గుర్తింపు ఉన్నాయి.

సంగీతం :

క్రీ.శ. మొదటి శతాబ్దంలో శాతవాహనుల పాలన కాలంలో హాలుడు | ప్రాకృతంలో రాసిన ‘గాథాసప్తశతి’ ఆంధ్రదేశంలో రూపుదిద్దుకున్న మొదటి సంగీత రచనగా పేర్కొంటారు. దాదాపు రెండువేల సంవత్సరాల కిందటివిగా గుర్తించిన కొన్ని సంగీత వాయిద్య పరికరాల వివరాలు అమరావతి, నాగార్జున కొండల్లో లభ్యమయ్యాయి. తర్వాత సారంగదేవుడు సంగీతరత్నాకరమనే గ్రంథం, విద్యారణ్యస్వామి సంగీత సారమనే గ్రంథం రాశారు. తర్వాత కొందరు ప్రముఖులు సంగీత | లక్షణాల్నీ, రాగ, తాళాల్నీ వివరిస్తూ రచనలు చేశారు. వాగ్గేయకారుల్లో | అత్యంత ప్రముఖుడు త్యాగరాజస్వామి. కర్ణాటక సంగీత మూర్తిత్రయంగా | త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి పేరు గాంచారు. ఈ | ముగ్గురు మహామహుల కృషి ఫలితంగా కర్ణాటక సంగీతం ప్రపంచ ఖ్యాతి గాంచింది. వాగ్గేయకారుల్లో అతి ముఖ్యుడిగా పేర్కొనదగ్గ మరో సంగీత జ్ఞుడు ‘ తాళ్లపాక అన్నమాచార్యులు. ఈయన 32,000 సంకీర్తనలు రచించాడు. ఇంకా నారాయణతీర్థులు, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య మొదలైన వారంతా మన సంగీతాన్ని సుసంపన్నం చేశారు. సంగీత కళను విస్తరింపచేసిన వారిలో అత్యాధునికులు -మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వీర రాఘవ శర్మ, ఘంటసాల, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ద్వారం వెంకటస్వామి నాయుడు (వయొలిన్) వేంకట రమణదాసు, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు (విణ. తదితరులెందరో ఉన్నారు.

నాట్యం :

ఆంధ్రదేశంలో నాట్యకళ మొదటి నుంచీ అమితాదరణ పొందింది. దుకు భరతముని రాసిన నాట్యశాస్త్రమే రుజువు. క్రీ.శ. ఒకటో శతాబ్దికే అంధులు ఈ కళలో ప్రావీణ్యం సాధించారని ఆ గ్రంథం చెబుతుంది. 1 నుంచి 11వ శతాబ్దం దాకా ఆంధ్రను పాలించిన చాళుక్యులు దేవాలయాల్లో నాట్య మండపాలు నిర్మించారు. 12వ శతాబ్దంలో నాచన సాముడు తన రచనల్లో నాట్య రీతుల్ని వర్ణించాడు. తర్వాతి రాజవంశాలు కూడా నాట్యకళని ఆదరించినట్లు ఆ కాలం నాటి గ్రంథాల, నిర్మాణాలు సాక్ష్యమిస్తాయి. 15వ శతాబ్దం తర్వాత కొంత కాలం క్షీణించినా, సిద్ధేంద్రయోగి కూచిపూడి శైలిని రూపొందించాక తిరిగి విలసిల్లింది.

కూచిపూడి నాట్యం :

telugu traditional dance

కృష్ణాజిల్లా విజయవాడకు 60 కి.మీ. దూరంలో ఉన్న కూచిపూడికి సమీపంలోని శ్రీకాకుళంలో సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యశైలికి శ్రీకారం చుట్టాడు. తాను రచించిన భామా కలాపాన్ని బ్రాహ్మణ బాలురకి నేర్పడం ద్వారా కృష్ణభక్తి ప్రచారం చేసేవాడు. గ్రామంలోని వారు దీనికి అంగీకరించకపోవడంతో, ఊరికి 6 మైళ్ల దూరంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ నాట్యం నేర్చుకునే బాలురని కుశలవులు అని పిలిచేవారు. ఆ పేరుతో ఈ కొత్త గ్రామం కుశీలవపురంగా, కుచీలపురిగా చివరికి ఈ నాటికి కూచిపూడిగా మారింది. మొదట్లో మగపిల్లలే నేర్చుకునే ఈ నృత్యం రాను రాను ఆడ పిల్లలు కూడా నేర్చుకోవడం మొదలైంది. ప్రస్తుతం ఇది ఆంధ్రదేశానికే వన్నె తెచ్చిన నాట్యకళగా పేరు పొందింది. ఇందులో ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అనే

నాలుగు అంశాలను ఉపయోగిస్తారు. కూచిపూడి నాట్యానికి సంగీతంలో శిక్షణ లేదా ప్రవేశం అవసరం. సిద్ధేంద్రయోగి దీన్ని ఎంతగా ప్రచారం చేసినా, కూచిపూడి శైలికి 20వ శతాబ్దం దాకా తగిన గుర్తింపు రాలేదు. తర్వాత వెంపటి చినసత్యం, వేదాంతం రాఘవయ్య, వేదాంతం సత్యనారాయణ; పసుమర్తి కృష్ణమూర్తి, బాలసరస్వతి, రాగిణీదేవి, ఇంద్రాణి, యామినీ కృష్ణమూర్తి, శోభానాయుడు, రాధా – రాజారెడ్డి మొదలైన వారెందరో ఈ నాట్యానికి దేశ విదేశాల్లో ఖ్యాతి నార్జించడానికి విశేషంగా కృషి చేశారు. చివరికి కూచిపూడికి కేంద్ర అకాడమి గుర్తింపు లభించేలా చేయగలిగారు.

 జానపద కళారూపాలు :

వీటన్నింటికంటే ముఖ్యమైనదీ, ఆంధ్రులకు ఖండాంతర కీర్తి నార్జించినదీ అయిన కళారూపం తోలుబొమ్మలాట. తెల్లటి తెర వెనుక తోలుబొమ్మల్ని ఆడించడం ద్వారా ప్రజల మనసుల్ని రంజింపచేయడమే తోలు

జానపద కళలకు ఆంధ్రదేశం పుట్టినిల్లు. మన రాష్ట్రంలో ఉన్నన్ని జానపద కళారూపాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవు. జనపదాలలో పుట్టినవే జానపద కళలు. జానపదం అంటే జనం నివసించే గ్రామం లేదా పల్లెటూరు. తరతరాల నుంచీ వారు ప్రదర్శించే కళారూపాలే (పాటలు, నాట్యం వగైరా) జానపద కళారూపాలు. వీటిలో ముఖ్యమైనవి కురవంజి, యక్షగానం, వీధి నాటకాలు, పగటి వేషాలు, జంగం కథలు, బుర్రకథ, జముకుల కథలు, పిచ్చుకుంట్లు వారు, హరికథలు, భాగవతులు, కనక తప్పెట్లు, చెక్కభజన, హరిహరి పదాలు, బైండ్ల వారు, ఇవికాక ఇంకా అనేక నృత్య రూపాలు మన జానపద కళారీతుల్లో ఉన్నాయి.

బొమ్మలాట. వినడానికింత సులభంగా ఉన్నా, ఈ బొమ్మల తయారీ చాలా కష్టంతో కూడుకున్నది. ఈ కళారూపం మనదేశం నుంచి అనేక యూరప్, ఆఫ్రికా, అరేబియా దేశాలకు చేరుకుని, బహుళ ప్రజాదరణ పొందింది. అయితే 20వ శతాబ్దంలో నాటకాలు, సినిమాలు, ఇప్పుడిప్పుడు _ టి.వి.ల ప్రభావం వల్ల ఎంతో ఘనచరిత్ర గల ఈ కళ మరుగున పడిపోయింది.

చిత్రకళ :

శాతవాహన, విజయనగర రాజుల కాలంలో ఆంధ్రదేశంలో బాగా విలసిల్లిన చిత్రకళ తర్వాత కొంతకాలం మరుగున పడిపోయింది. బౌద్దమతం, ఆంధ్రప్రాంతానికి చిత్రలేఖన కళను తీసుకువచ్చింది. లేపాక్షి, తంజావూరు, హంపీ, ఆనెగొంది తదితర ప్రాంతాల్లో కుడ్య చిత్రాలన్నీ 16వ శతాబ్దం నాటివి. 18, 19 శతాబ్దాల్లో జానపద కళగా మారి మచిలీపట్నంలో కలంకారీ, కాశీకావడి చిత్రాలు, తోలుబొమ్మలు, దశావ తారాలు, కొండపల్లి బొమ్మల్లో మన చిత్రకళ కనిపిస్తుంది. 20వ శతాబ్దంలో తిరిగి ఆంధ్రప్రాంతంలో చిత్రకళకు ఆదరణ పెరిగింది. దీన్ని సుసంపన్నం చేసిన వారిలో ముఖ్యులు – దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, వడ్డాది పాపయ్య, సి.ఎస్. వెంకటరావు, వి.వి. భగీరథ తదితర మహానుభావులు. రాజమండ్రి, పెనుగొండల్లో చిత్రకళ కోసం కాలేజీలు ఏర్పడ్డాయి. ఇటీవలి చిత్రకారుల్లో సంజీవదేవ్, పి.టి. రెడ్డి, ఎస్.వి. రామారావు, బాపు, చంద్ర తదితరులు ముఖ్యులు. బాపు రేఖాచిత్రాల శైలిని ప్రస్తుతం అనేక యువ చిత్రకారులు అనుసరిస్తున్నారు. ఇప్పటి కార్టూన్లు కూడా మన చిత్రకళను ప్రదర్శిస్తున్న రూపాలే.

 శిల్పకళ :

ప్రతీ జాతికి దాని సంస్కృతి, సంస్కారం, ఆచారాల్లోనూ, నడవడికలోనూ, భాష, సాహిత్యం, ఇతర కళారూపాల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ సంస్కృతి ఆ జాతికి తరతరాలుగా వారసత్వం గా వస్తుంది. మొట్టమొదట్లో శాతవాహనులతో ఆరంభమైన ఆంధ్రదేశం, తర్వాత అనేక రాజవంశాల పాలనా కాలంలో ఆయా రాజుల స్వభావాలకు అనుగుణంగా తన సంస్కృతీ స్వభావాలను తీర్చిదిద్దుకుంది. అలా ఏర్పడ్డ కళారూపాల్లో మన శిల్పకళకున్న స్థానం చెప్పుకోదగినది. బౌద్ద శాసనాలు దక్షిణ బ్రాహ్మీ లిపిలో ఆంధ్రదేశంలో రాయ బడ్డాయి. ఈ లిపి నుంచే మన తెలుగు భాష వికసించింది. ఈ కాలం నాటి శిల్పాల్లో బుద్ధుడి బోధనలు, జాతక కథలు ఇతివృత్తాలుగా ఉన్నాయి, అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, శాలిహుండం, ఘంటసాల తదితర ప్రాంతాల్లో బౌద్ద స్థూపాలు, చైత్యాలయాలు బయటపడ్డాయి. వీటిలో శిల్పకళ బౌద్దరీతులకు చెందినదే. తర్వాత అనేక రాజవంశాల పాలనా కాలంలో అనేక రీతుల్లో శిల్పకళ అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేవాలయాల్లోనే . ఈ కళకు ఆదరణ లభించింది. ద్రాక్షారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం, సోమారామాలు బౌద్ధారామాలు కాగా, బిక్కవోలు, ర్యాలి వంటి దేవాలయాల్లో ద్రావిడ రీతి చిత్రకళ కనిపిస్తుంది. లేపాక్షి – హంపి, చంద్రగిరి, సింహాచలం, తిరుపతి

ప్రాంతాల్లో విజయనగర రాజుల శిల్ప శైలి కనిపిస్తుంది. శ్రీశైలం, అహో 5. బిలం, మహానంది, కాళహస్తి, మంగళగిరి, అమరావతి, అరసవిల్లి,

శ్రీకూర్మం తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో శిల్పకళ ఆంధ్రుల | శైలిలోని విశిష్టతను చాటి చెబుతుంది. ఆంధ్ర ప్రాంతం దేశంలోని నాలుగు దిక్కుల్ని కలిపే విధంగా మధ్యలో ఉండటంవల్ల భారతదేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఈ కారణం చేతనే ఇక్కడ బౌద్దమత వ్యాప్తితో బాటు ఆ శిల్ప రీతులు కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. కర్నూలు, అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ ప్రాంతాల్లో ఈ శిల్ప రీతులు ఎక్కువగా కనబడతాయి. స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాల నిర్మాణం కూడా విస్తృతంగా జరిగింది. ఈ శిల్ప కళాశైలి ఈనాటికీ యాత్రికుల్ని విస్తృతంగా ఆకర్షిస్తోంది.

హస్తకళలు :

హస్త కళల్లో కూడా ఆంధ్ర దేశం మొదటి నుంచీ ముందంజలో ఉంది. అనాదిగా వస్తున్న ఈ కళల్లో కొన్ని ఇప్పుడు, ఈ యంత్రయుగంలో మరుగునపడిపోయే ప్రమాదంలో ఉండటం అతి విచారకరమైన విషయం. ముఖ్యంగా చేనేత వస్త్రాలకి మన రాష్ట్రం పెట్టింది పేరు. ప్రస్తుతం దీనికి మాత్రం ప్రజాదరణ విస్తృతంగా లభిస్తోంది. వెంకటగిరి, పాటూరు, మంగళగిరి, చీరాల, మాధవరం (కడప) పుల్లేటికుర్రు, ఉప్పాడ, పొందూరు, కొత్త పేట, ప్రాంతాలు చేనేత వస్త్రాలకి ప్రసిద్దికెక్కాయి. ఇంకా కలంకారీ, బొమ్మల తయారీ (ఏటికొప్పాక, కొండపల్లి, నక్కపల్లి), బిద్రీ, ఫిలిగ్రీ (వెండి నగిషీపని), బంజారా కుట్టుపనులు, తివాచీల నేత, అల్లిక పని (లేసులు నరసాపురం), మొదలైన హస్తకళలన్నీ మన ఆంధ్ర పాంత్రంలోని చేతి పని వారి గొప్పతనాన్ని తెలియజేస్తాయి.

సంగీతకళ :

తెలుగువారు నాట్యశాస్త్రకర్త భరతముని కాలం నుంచి, సంగీతజ్ఞులనే విషయానికి అనేక సాక్ష్యాలున్నాయి. కర్నాటక శాస్త్రీయ సంగీతం సంకీర్తన, పద, యక్షగాన, కలాప ప్రబంధ, గాత్రకచ్చేరి సంప్రదాయాలని ఐదు విధాలు. ఆంధ్రులు భారతీయ సంగీతానికి అర్పించినవి ముఖ్యమైన మూడు రకాలు, ఆంధ్ర యరుకుల లేదా యదుకుల, కాంభోజి, తిలంగ్ అనేవి. సంగీతజ్ఞులైన ఆంధ్రులలో కొందరు లక్షణ కర్తలు. కొందరు లక్ష్యకర్తలు,

లక్షణ కర్తలు :

శార్గదేవుని సంగీత రత్నాకరానికి మల్లినాథుడు, సర్వజ్ఞసింగ భూపాలుడు వ్యాఖ్యానం రచించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారకుడైన విద్యారణ్యస్వామి సంగీతసారమనే లక్షణ గ్రంథంలో మొదటిసారిగా మేళకర్త, జన్యరాగ పద్దతిని ప్రవేశ పెట్టాడు. తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనా లక్షణం రచించాడు. ఆరవీటి రామరాయల ఆస్థానంలోని రామయామాత్యుడు ‘స్వరమేళ కళానిధి’ అనే గ్రంథం రచించాడు. సంగీత సూర్యోదయం రచించిన బండారు లక్ష్మీనారాయణ, సంగీత పారిజాతం రచించిన అహోబల పండితుడు, సంగీతసుధ రచించిన గోవింద దీక్షితులు, రాగవిభోధకర్త సోమనాథుడు, రాగతాళ చింతామణి రాసిన పోలూరి గోవిందకవి మొదలైన వారు కూడా లక్షణ కర్తలు.

లక్ష్యకర్తలు, వాగ్గేయకారులు :

వాగ్గేయకారులలో మొదట పేర్కొనవలసిన వారు 32,000 సంకీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమయ్య. ఈయన సంకీర్తనలలో భక్తి, శృంగార, వైరాగ్యాలను సమాన దక్షతతో పోషించడం జరిగింది. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, తరంగాలు రచించిన నారాయణ తీర్థులు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ప్రఖ్యాతులు. నృత్య సంగీత సమ్మేళనమైన ‘భామాకలాపం’ సృష్టించినవారు సిద్ధేంద్రయోగి. ఎన్నో పదాలు రచించి భావానుగుణంగా రాగాన్ని వాడినవారు క్షేత్రయ్య. వాగ్గేయకారులలో నాయకమణి వంటివారు త్యాగరాజస్వామి. ఈయన కీర్తన పాడటంలో విరుపు చెయ్యడం అనే పద్ధతిని ప్రవేశ పెట్టడమే కాక, అనేక అపూర్వ రాగాలలో రచనలు చేసి కర్నాటక సంగీతానికి మారు పేరయ్యారు. కర్నాటక సంగీత మూర్తి త్రయంలో మొదటివారు త్యాగయ్య కాగా, తక్కిన ఇద్దరూ ముత్తు స్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి. వీరు తెలుగులో అనేక రచనలు చేశారు. స్వాతి తిరునాళ్ కూడా అనేక తెలుగు రచనలు చేశారు.

ఆధునికులలో హరికథా పితామహుడు నారాయణదాసు, హరి నాగభూషణం, మైసూరు వాసుదేవాచార్, అత్యాధునికులలో బాలమురళీకృష్ణ, ఓరిగారల వీరరాఘవశర్మ, ఈదర నాగరాజు, ఘంటసాల ప్రసిద్ధులు. అన్నమాచార్యుల పదాలను స్వరపరచిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు వాగ్గేయకారులు, లక్షణ శాస్త్రజ్ఞులు, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రపంచ ఖ్యాతి పొందిన వయొలిన్ విద్వాంసులు. వీణ వేంకటరమణదాసు, తుమురాడ సంగమేశ్వర శాస్త్రి ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు ప్రసిద్ధ వైణికులు. కర్ణాటక సంగీతంతో ఉత్తేజితులైన పాశ్చాత్యులు కొందరు దానిని అభ్యసించారు. హెన్రీ హిగ్గిన్స్ అనే పాశ్చాత్యుడు ఇందుకు ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో కాలానుగుణంగా రచన ప్రాముఖ్యంలోకి రావడంతో శాస్త్రీయ సంగీతానికి భిన్నమయిన లలితసంగీతం ప్రచారంలోకి వచ్చింది. దీనికి జానపద సంగీతమే ప్రాతిపదిక అనవచ్చు. ఆ ప్రాతిపదికపై శాస్త్రీయ సంగీత జ్ఞానంతో లలిత సంగీతం పరిధి విస్తృతమైంది. దీనికి సినిమా, రేడియో, గ్రామ్ఫోన్, ఇటీవల టెలివిజన్ వల్ల మంచి ప్రచారం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *