గంగిగోవు పాలు గరిటెడైనా చాలు.. అని ఎందుకు అంటారు ?

befits of cow,

భారత దేశానికి రైతు వెన్నుముక అనిఅంటాం . అలాంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతులకి పొలం లేక పోయిన ఆవులు ఉంటాయి అని అందరికి తెలిసిన విషయమే. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి, అందుకే ఆవు హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువు . ఆవు పాలు ఎంతో ఆరోగ్యమైనవి. ఆవు నెయ్యిని అగ్నికి ఆహుతిస్తే ఆక్సీజెన్ (ప్రాణవాయువు) ను ఉత్పత్తి చేస్తుంది. ఆవు పాలను ప్రతి రోజు తాగడం వలన వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.

ఒక్క ఆవు వేసే మూత్రం , పేడ వల్ల రైతు 30 ఎకరాలలో సులభంగా, విష రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఆవు నుండి వచ్చేగోమూత్రం వలన అనేకవ్యాధులు నయం అవుతాయి.

“గోమూత్రం” ద్వారా కలిగే ప్రయోజనాలు :

  • రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు,
  • చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు .
  • కాలేయం సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.
  • గోమూత్రం లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ
  • మైక్రోబియల్‌ఉండడం వలన ఆరోగ్య సమ్యల నుండి విముక్తి కలిగిస్తాయి.

ఆవు పేడ ద్వారా కలిగే ప్రయోజనాలు :

  • ఆవు పేడ ను సేంద్రీయ వ్యవసాయం కోసం ఉపయోగించుకోవచ్చు.
  • ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నశింపచేసే శక్తి ఉంది.
  • ఆవు పేడ తో ఇంటి ముందు కళ్లపు చల్లుకోవడం వల్లన ఇంటి లోనికి బ్యాటిరియ చేరవు.
  • ఆవు ఫేడతో వంటికి మర్దన చేసి ఒక గంట తరవాత వేడినీళ్ళతో శుభ్రం చేసుకుంటే దురదలా నుండి ఉపశమనం కలుగుతుంది.
  • ఆవు పేడతో బయో గ్యాస్ తయారుచేస్కొవచ్చు.

ఇలాగ చెప్పుకుంటూ పొతే ఆవు నుండి చాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వేమన గారు – గంగిగోవు పాలు గరిటెడైనను చాలు , కడివెడైననేమి ఖరము పాలు , అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *