“అల వైకుంఠపురం లో” టైటిల్ ప్లస్ పాయింట్ అవుతుందా.?

సినిమా టైటిల్ ఎంతో ప్రత్యేకమైనది అని అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేలా చేస్తాయి. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కలయికలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ పేరు “అల వైకుంఠపురం లో”.

ఈ చిత్ర టైటిల్‌ను చిన్న టీజర్ ద్వారా ప్రకటించారు. జులాయి మరియు S / o సత్యమూర్తి మాదిరిగానే, అల్లు అర్జున్ కూడా అల వైకుంతపురం లో లో కూడా మధ్యతరగతి యువకుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివరిలో బన్నీ, ముర్లి శర్మల మధ్య చమత్కారమైన సంభాషణ వినోదభరితంగా ఉంది.

అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి మరియు అరవింద సమేత చిత్రాలు క్లాస్ టైటిల్ తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు అల వైకుంఠపురం లో చిత్ర టైటిల్ ఎంతో సాఫ్ట్ గా ఉంది కావున త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఈసారి “అల వైకుంఠపురం లో” మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడని అనుకుంటున్నారు.

అల వైకుంతపురం లో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే, నివేదా పెతురాజ్ నటిస్తుండగా ప్రత్యేక పాత్రలో టబు, నవదీప్ మరియు సుశాంత్ నటించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.