రామ్ చరణ్ చేసిన తప్పే అఖిల్ కూడా చేస్తున్నాడా..?

Ram Charan, Akkineni Akhil, Akhil New Movie, Ram Charan New Movie

తొలి సినిమా నుండి టాలీవుడ్ లో మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని అక్కినేని వారసుడు విశ్వప్రయత్నం చేస్తున్నాడు, అయినప్పటికీ ఆ ప్రయత్నాలేవీ ఫలించక అతని కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. ఈ మధ్య గంపెడు ఆశతో చేసిన మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ అయ్యింది, దీంతో అఖిల్ తన కెరీర్ గురించి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మిస్టర్ మజ్ను విడుదలైన కొన్ని రోజులకే అఖిల్ తర్వాతి సినిమా శ్రీను వైట్లతో ఉండబోతుంది అన్న వార్తలు వచ్చాయి, దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ విపరీతంగా వచ్చాయి, ఆ వార్తలు అక్కినేని అభిమానుల్లో టెన్షన్ పెంచాయి. తర్వాత అవి వట్టి రూమర్స్ అని తేలటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అఖిల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి.

గీతా ఆర్ట్స్ లాంటి సక్సెస్ ఫుల్ అండ్ ప్రెస్టీజియస్ బ్యానర్ లో అఖిల్ సినిమా చేయనుండటం సంతోషించాల్సిన వార్తే అయినప్పటికీ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా అన్న వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇందుకు కారణం భాస్కర్ తెలుగులో ఆల్మోస్ట్ ఫేడ్ ఔట్ అయిన పరిస్థితిలో ఉండటం, అంతకు మించి రామ్ చరణ్ కు ఆరెంజ్ లాంటి డిజాస్టర్ భాస్కర్ డైరెక్షన్లోనే రావటం. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ కు ఆరెంజ్ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు భాస్కర్, అసలే అఖిల్ కెరీర్ డేంజర్ లో ఉన్న సమయంలో రామ్ చరణ్ కు ఇచ్చినట్టే అఖిల్ కు కూడా భాస్కర్ డిజాస్టర్ ఇస్తాడేమో అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. గీతా ఆర్ట్స్ లో అఖిల్ సినిమా అన్నది ఫాన్స్ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం, ఎందుకంటే కథలో విషయం లేనిది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భాస్కర్ కు ఒక చెప్పాడు కాబట్టి. మొత్తానికి హిట్ కంపల్సరీ అయిన పొజిషన్ లో ఉన్న అఖిల్ కు భాస్కర్ ఎలాంటి సినిమా ఇస్తాడో వేచి చూడాలి.