తెలంగాణా ప్రభుత్వంతో చర్చలు సఫలం అవ్వడంతో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరన

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి మొదలుపేటెందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో కలిసి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయా ఆస్పత్రుల ప్రతినిధులతో కలిసి మరోసారి చర్చలు జరిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి అని వెల్లడించారు.

దీనితో ఇక సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు పత్రిక విలేకర్ల సమావేశంలో ప్రకటించాయి. సమ్మె విరమించడంతో ఈ రోజు నుండే ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి అధికారులు వెల్లడించారు.