స్పైసీ టమోటో – ఉల్లిపాయ సబ్జీ
కావల్సిన పదార్థాలు:
- 6 మీడియం టొమాటోలు
- 1 పెద్ద ఉల్లిపాయ
- 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/4 tsp పసుపు పొడి
- 1 స్పూన్ కారం పొడి
- 2 tsp దనియాల పొడి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1 టేబుల్ స్పూన్ శనగ పప్పు
- 1 టేబుల్ స్పూన్ ఉద్ది పప్పు
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- రుచికి సరిపడా ఉప్పు
- కొత్తిమీర, కరివేపాకు
వెజిటబుల్ కిచిడీ (Vegetable Khichdi) ఎలా ?
మ్యాంగో పులిహోరా(మ్యాంగో రైస్) తయారు చేయడం ఎలా ?
తయారుచేయు విధానం:
- ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి, నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగానివాలి.
- వేగిన తర్వాత పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 3 లేదా 4 నిముషాలు వేగించుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా , అందులో పసుపు పొడి వేసి బాగా కలియబెడుతూ బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేస్కుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి, టమోటో ముక్కలు మరియు ఉప్పు వేసి వేగించుకోవాలి.
- టమోటో మెత్తబడేవరకూ సన్నని మంట పైన ఉడికించాలి. గరిటెతో టమాటో ప్రెస్ చేస్తూ కలియబెట్టడం వల్ల టమోటో మెత్తగా గుజ్జులా తయారవుతుంది.
- టమోటో గుజ్జుగా అయిన తర్వాత అందులో ధనియాల పొడి, కారం పొడి వేసి మరో నిముషం ఉడికించుకోవాలి. కారం పొడి వాసనా పోయే వరకు సన్నని మంట పైన కలియబెడుతూ ఉండాలి.
- అన్నింటిని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే స్పైసీ టమోటో ఆనియన్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీ సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.