రాబోయే 4 రోజులు హైదరాబాద్ లో నీటి కరువు కారణం ఏంటి అంటే?

రాజధాని ప్రజలకు ఒక చేదు వార్త. హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగిపోనుంది అని అధికారులు వెల్లడించారు. ఈ నెల 26, 27 కొన్ని ప్రాంతాల్లోనూ మరియు 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ నీటి సరఫరా నిలిపివేస్తామని జలమండలి అధికారులు వెల్లడించారు. గండిపేట నుంచి అసిఫ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న ఫిల్టర్‌బెడ్‌కు నీటి తరలింపులో నీటి పైపులైన్‌ కాలువ మరమ్మతులు, అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌ క్లీనింగ్‌ దృష్ట్యా రేపు, ఎల్లుండి (26, 27). కృష్ణా మొదటి దశ పైపులైన్‌కు భారీ లీకేజి గుర్తించిన జలమండలి అధికారులు దాని మరమ్మతుల నేపథ్యంలో గానూ ఈ నెల 28 తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రేపు, ఎల్లుండి (26, 27) మంచినీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే:

కాకతీయ నగర్‌, చింతల్‌బస్తీ, సాలార్జంగ్‌ కాలనీ, పార్ట్‌ పద్మనాభ నగర్‌, కుందర్‌బాగ్‌, బోయిగూడ కమాన్‌, వినయ్‌ నగర్‌ కాలనీ, హుమాయున్‌ నగర్‌, సయ్యద్‌ నగర్‌, ఏసీ గార్డ్స్‌, జవహర్‌నగర్‌, ఖైరతాబాద్‌, మల్లేపల్లి, అజంపుర, నాంపల్లి, దేవిబాగ్‌, అఫ్జల్‌ సాగర్‌, సీతారాంబాగ్‌, హబీబ్‌నగర్‌, ఎస్‌ఆర్‌టీ, అశోక్‌నగర్‌, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, జ్యోతి నగర్‌, వినాయక్‌ నగర్‌, మైసమ్మ బండ, ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌, సెక్రటేరియట్‌, రెడ్‌హిల్స్‌, హిందీ నగర్‌, గోడెకీకబర్‌, గన్‌ఫౌండ్రీ, దోమలగూడ, లక్డీకపూల్‌, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి.

ఈ నెల 28, 29 మంచినీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే:

దిల్‌సుఖ్‌నగర్‌, అలియాబాద్, మిరాలాం, కిషన్ భాగ్, రియాసత్ నగర్, చంచల్ గూడ, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ ఘాడ్, యాకుత్ పుర, మలక్ పేట్, నారాయణ గూడ, మూసారాంబాగ్‌, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, హిందినగర్, అడిక్ మెట్, శివం, చిలకలగూడ.