మాస్క్ ధరించకుంటే రూ.1000 కట్టాల్సిందే, తెలంగాణ సర్కారు నిర్ణయం

Telangana News

TS: మాస్కు పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్లే. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ.1,000 జరిమానా కట్టాల్సిందే. గురువారం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో ఈ నిబంధనను సర్కారు స్పష్టంగా పేర్కొంది. మాస్కు లేకుంటే రూ.వెయ్యి ఫైన్ వేయాల్సిందేనని ఆదేశించింది. అలాగే ఆస్పత్రులు, మెడికల్స్ తప్ప అన్ని దుకాణాలు సాయంత్రం 6 తర్వాత బంద్ చేయాలని స్పష్టంచేసింది.