పవన్ కళ్యాణ్ ఐరన్ లెగ్ ,అతను ప్రచారం చేయటం వల్లే ఓడిపోయాను – ఏపీ మంత్రి వెల్లంపల్లి

andhra news,Pawan Kalyan,telugu news, ycp mp vellampalli,

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అడుగుతూ గతంలో మీరు పవన్ కల్యాణ్ తనకు మద్దతుగా మీడియా ముఖంగా ఓట్ వెయ్యమని చెప్పండి అని అడగలేదా, అలాగే పవన్ కళ్యాణ్ ఆశీస్సుల కోసం ప్రయత్నించింది నిజం కాదా? అని పవన్ అభిమానులు అంటున్నారు, దీనికి మీరేమంటారు? అని న్యూస్ యాంకర్ ప్రశ్నించగా, తాను చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దేవుడి దయవల్ల పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రచారానికి రాలేదని, ఆ ఎన్నికల్లో తాను గెలిచానని వెల్లడించారు.

నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది చిరంజీవి…!

అయితే, 2014లో తాను బీజేపీ తరఫున బరిలోకి దిగితే, తన తరఫున పవన్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయానని తెలిపారు. మళ్లీ 2019లో పవన్ ఆశీస్సులు లేకుండానే గెలిచానని, తాను ఎవరి గురించైనా చెప్పుకోవాల్సి వస్తే అది చిరంజీవి గురించేనని అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది చిరంజీవేనని, నేను చిరంజీవికి మాత్రమే విధేయుడను అని, పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని స్పష్టం చేశారు.

రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి నన్ను గెలిపిస్తాడు అంటే ఎవరు నమ్ముతారు..?

దురదృష్టం కొద్దీ 2014లో నాకు ఓటేయమని పవన్ చెప్పాడని, అప్పుడు ఓడిపోయానని వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఐరన్ లెగ్ కారణంగానే ఓడిపోయానని అన్నారు. ఒకవేళ పవన్ అంతపెద్ద లీడర్ అయ్యుంటే రెండు చోట్ల ఎందుకు ఓడిపోతాడని వెల్లంపల్లి ప్రశ్నించారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి నన్ను గెలిపిస్తాడంటే ఎవరు నమ్ముతారు? ఇప్పటికైనా పవన్ కల్యాణ్ అభిమానులు ఈ వాస్తవం తెలుసుకోవాలి అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *