నిలకడగా డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం

కరోనా వైరస్‌తో బాధపడుతూ  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది.  చికిత్స పొందుతున్న హాస్పిటల్ నుంచే అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహిస్తున్న ట్రంప్‌ ట్విట్టర్ లోను చికిత్సపై ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. చికిత్సకు ట్రంప్‌ స్పందిస్తున్నారని అధ్యక్షుడి ఫిజిషియన్‌ షాన్‌ కాన్లీ తెలిపారు. కరోనా సోకినప్పటికి ఇప్పటికీ ట్రంప్‌ ఆరోగ్యం బాగుందని చెప్పారు. ట్రంప్‌కు  రెండుసార్లు రెమిడెసివిర్‌ ఇచ్చారని, ఆ డ్రగ్‌ తీసుకున్న తరువాత ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఆయనకు రేపు మళ్ళి వైద్యులు రెమిడిసివిర్‌ను ఇస్తారని చెప్పారు.

‌డోనాల్డ్ ట్రంప్ కు మొదట రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గినా చికిత్స తర్వాత పెరిగాయని ప్రస్తుతం ఆక్సిజన్‌ లెవెల్స్‌ నిలకడగా ఉన్నాయని కాన్లీ చెప్పారు. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, రాబోయే 48 గంటలు ముక్యమని చెబుతూ ట్రంప్‌ ఒక వీడియో విడుదల చేశారు. మరోవైపు అధ్యక్షుడు మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావచ్చని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా మీడియాలోనూ ట్రంప్‌ ఆరోగ్యంపై పలు కథనాలు వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *