తమిళనాడు లో ఒక్కరోజులోనే 580 కరోనా కేసులు..!

Corona pics

తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 580 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో పాటు ఇద్దరు మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నైలోనే ఉన్నట్లు తెలిపింది. వీటితో కలిపి తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,409కి చేరింది. ప్రస్తుతం 3,935 మంది చికిత్స పొందుతుండగా..1,547 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 37 మంది మరణించారు.