టైటిల్ మార్చిన వర్మ , కొత్త టైటిల్ ఇదే.!

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమాకు సెన్సార్ పూర్తి కాకపోవడం..ఈ చిత్ర టైటిల్ ఫై కోర్టు లో పిటిషన్ వేయడం తో సినిమా రిలీజ్ కు అడ్డు పడ్డట్లు అయ్యింది. దీంతో వర్మ ఈ చిత్ర టైటిల్ ను మార్పు చేసాడు.

‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. దీంతో ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు లేకుండా అయిపొయింది. మరి రేపు ఈ సినిమాకు సెన్సార్ చేస్తారా..ఒక్క రోజులో సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ అవుతుందా అనేది చూడాలి .