కరోనా లో దూసుకుపోతున్న ఇండియా, 13 వ స్థానంలో..!

Corona in india

కరోనా వైరస్ రేసులో భారత్ కూడా దూసుకొస్తుంది. ప్రపంచంలోని పలు అగ్ర దేశాలతో పోలిస్తే ఇండియాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతోంది. అయితే కరోనా అత్యధిక కేసులు ఉన్న దేశాల జాబితాలో వారం రోజుల క్రితం భారత్ 15వ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు 13కి చేరుకుంది. ఇండియాకన్నా ముందు పెరూ, కెనడా, చైనా, ఇరాన్, బ్రెజిల్, టర్కీ, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, యూకే, ఇటలీ, స్పెయిన్, అమెరికా మాత్రమే ఉన్నాయి.