ఒక్క రోజులోనే 160 కోట్ల మద్యం అమ్మకం, ఎక్కడో తెలుసా…?

Drinkers in India

కర్నాటకలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇవాళ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. నేడు రూ.165 కోట్ల మందును అమ్మినట్లు అధికారులు తెలిపారు. చాలా రోజుల తర్వాత మద్యం అందుబాటులోకి రావడంతో మందుబాబులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో భౌతిక దూరం పాటించకుండా నిల్చున్నారు. ఇటు ప్రభుత్వం తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.